ETV Bharat / sitara

Bheemla Nayak in Theatres : థియేటర్లలో దడ పుట్టిస్తోన్న భీమ్లా నాయక్ ఫ్యాన్స్

author img

By

Published : Feb 25, 2022, 10:26 AM IST

Bheemla Nayak in Theatres : 'అలగలగలగలగల.. లాలా.. అలగలగలగలగల.. భీమ్లా.. అడవిపులి.. గొడవపడి..' భీమ్లా నాయక్ థియేటర్లకు వచ్చేశాడు. కరోనా, ఒమిక్రాన్‌ల దాడికి వాయిదా పడుతూ ఎట్టకేలకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మరోసారి పవర్‌ఫుల్ కాప్‌గా ఫ్యాన్స్‌ను అలరించడానికి రెడీ అయ్యాడు. వకీల్ సాబ్‌ తర్వాత పవర్ స్టార్ సినిమా కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్న అభిమానులకు ఫుల్‌మీల్స్ పెట్టేందుకు పవన్ కల్యాణ్ సినిమా భీమ్లా నాయక్ థియేటర్లలో సందడి చేస్తోంది. ఇవాళ విడుదలైన ఈ సినిమా చూసేందుకు తెల్లవారుజాము నుంచే థియేటర్ల వద్ద పవర్ స్టార్ ఫ్యాన్స్ పెద్దఎత్తున బారులు తీరారు. లాలా.. భీమ్లా నాయక్ అంటూ నినాదాలు చేస్తూ.. పవర్‌ స్టార్ కటౌట్ల వద్ద కోలాహలం చేస్తున్నారు.

Bheemla Nayak in Theatres
Bheemla Nayak in Theatres

Bheemla Nayak in Theatres : ప్రేక్షకులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న భీమ్లా నాయక్‌ సినిమా థియేటర్లలో మాస్ జాతర మొదలుపెట్టింది. కరోనా తర్వాత సినిమా హాళ్లకు మళ్లీ కళ తీసుకొస్తుందన్న భారీ అంచనాలతో విడుదలైన భీమ్లా నాయక్‌.. అందుకు తగ్గట్టుగానే హల్‌చల‌్ చేస్తోంది. పవన్‌ కల్యాణ్‌ అభిమానులు తెల్లవారుజాము నుంచే హైదరాబాద్‌లో థియేటర్ల ముందుకు చేరారు. పవన్ ప్యాన్స్‌తో నగరంలోని థియేటర్లన్ని కిటకిటలాడుతున్నాయి.

భీమ్లా నాయక్ ఫ్యాన్స్‌తో దద్దరిల్లుతున్న థియేటర్లు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.