ETV Bharat / sitara

రామ్​-బోయపాటి సినిమాలో బాలీవుడ్​ హీరోయిన్​!

author img

By

Published : Feb 22, 2022, 8:28 AM IST

Parineeti chopra in  Rampotineni Boyapati  movie
రామ్​-బోయపాటి సినిమాలో బాలీవుడ్​ హీరోయిన్

Rampotineni boyapati movie heroine: రామ్​పోతినేని-దర్శకుడు బోయపాటి కాంబోలో తెరకెక్కనున్న చిత్రంలో బాలీవుడ్​ హీరోయిన్​ను ఎంపిక చేయాలని చిత్రబృందం భావిస్తోందట! ఇప్పటికే కథానాయిక పరిణితి చోప్రాతో మూవీటీమ్​ చర్చలు జరుపుతోందని తెలిసింది. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది.

Rampotineni parineeti chopra: పాన్​ఇండియా సినిమాల హవా ప్రారంభమైనప్పటి నుంచి బాలీవుడ్​ ముద్దుగుమ్మలను తీసుకోవడానికే ఆసక్తి చూపుతున్నారు టాలీవుడ్​ దర్శకనిర్మాతలు! ఇప్పటికే దీపికా పదుకొణె, ఆలియా భట్​ సందడి చేసేందుకు సిద్ధమవ్వగా.. ఇప్పుడు పరిణితి చోప్రా కూడా ఈ జాబితాలోకి చేరిపోయినట్లు తెలుస్తోంది.

రామ్​పోతినేని-బోయపాటి శ్రీను కాంబినేషన్​లో ఓ సినిమా తెరకెక్కబోతున్నట్లు ఇటీవలే ప్రకటించారు. ఈ మూవీలోనే పరిణితి చోప్రాను తీసుకోవాలని చిత్రబృందం భావిస్తోందట. ఇప్పటికే చర్చలు కూడా జరిగాయని.. నటించేందుకు హీరోయిన్​ కూడా సుముఖంగా ఉన్నట్లు తెలిసింది. దాదాపుగా ఆమె ఎంపిక ఖరారైపోయిందని అంతా మాట్లాడుకుంటున్నారు. త్వరలోనే అధికార ప్రకటన వచ్చే అవకాశముంది. కాగా, గ్రామర్​, నటన పరంగా చోప్రాకు బీటౌన్​లో మంచి క్రేజ్​ ఉంది. హీరోయిన్ ఓరియెంటెడ్​ సినిమాలు చేసిన అనుభవం కూడా ఉంది. ప్రస్తుతం రామ్​.. లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.

ఇదీ చూడండి: అదా శర్మ, భూమి ఫెడ్నేకర్, అనన్య​ హాట్​ షో..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.