ETV Bharat / sitara

నితిన్‌ కోసం నిధి.. బెల్లంకొండకు జోడీగా బాలీవుడ్ భామ!

author img

By

Published : Sep 17, 2021, 8:11 AM IST

వరుస చిత్రాలతో బిజీగా గడుపుతున్న హీరోయిన్ నిధి అగర్వాల్(nidhhi agerwal news).. ఇప్పుడు మరో టాలీవుడ్​ చిత్రంలో ఛాన్స్​ కొట్టేసింది. నితిన్​ హీరోగా రూపొందుతోన్న 'మాచర్ల నియోజకవర్గం' చిత్రంలోనూ హీరోయిన్​గా ఎంపికైందని సమాచారం. మరోవైపు 'ఛత్రపతి' హిందీ రీమేక్​లో కథానాయికగా బాలీవుడ్‌ భామ నుష్రత్‌ భరూచా సంప్రదించినట్లు తెలుస్తోంది.

nidhi agarwal
నిధి అగర్వాల్

'ఇస్మార్ట్‌ శంకర్‌' సినిమాతో హిట్‌ ట్రాక్‌ ఎక్కింది హీరోయిన్ నిధి అగర్వాల్‌(nidhhi agerwal news). ఆ చిత్రమిచ్చిన విజయోత్సాహంతో ఇటు తెలుగులోనూ.. అటు తమిళంలోనూ వరుస సినిమాలతో సందడి చేస్తోంది. ప్రస్తుతం తెలుగులో పవర్​స్టార్​ పవన్‌ కల్యాణ్‌కు జోడీగా 'హరి హర వీరమల్లు' చిత్రంలో నటిస్తున్న ఆమె.. ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్ట్‌ అందిపుచ్చుకున్నట్లు తెలిసింది.

nidhi agarwal
నిధి అగర్వాల్

ప్రస్తుతం నితిన్‌(Nithin New Movie) కథానాయకుడిగా ఎంఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. ఆ సినిమాకు 'మాచర్ల నియోజకవర్గం' అనే టైటిల్‌ ఖరారు చేశారు. కృతిశెట్టి నాయిక. ఇప్పుడీ సినిమా కోసం మరో నాయికగా నిధిని(nidhhi agerwal latest news) ఖరారు చేసినట్లు సమాచారం. విభిన్నమైన యాక్షన్‌ డ్రామా కథాంశంతో రూపొందనున్న చిత్రమిది. త్వరలో రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభం కానుంది. దీన్ని సుధాకర్‌ రెడ్డి, నిఖితా రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తుండగా.. మహతి స్వరసాగర్‌ స్వరాలందిస్తున్నారు.

బెల్లంకొండకు జోడీగా

ప్రభాస్‌.. రాజమౌళిల హిట్‌ సినిమా 'ఛత్రపతి'(chatrapathi hindi remake) ఇప్పుడు బాలీవుడ్‌లో రీమేక్‌ అవుతోంది. బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని వి.వి.వినాయక్‌ తెరకెక్కిస్తున్నారు. జయంతిలాల్‌ గడ నిర్మాత. ఇందులో బెల్లంకొండకు జోడీగా ఓ బాలీవుడ్‌ భామ నటించనున్నట్లు ఇప్పటికే వార్తలొచ్చాయి. ఆ పాత్ర కోసం తొలుత అనన్య పాండే, దిశా పటాని లాంటి పేర్లు వినిపించాయి.

nushrat bharucha
నుష్రత్‌ భరూచా

అయితే ఆ అవకాశం బాలీవుడ్‌ బ్యూటీ నుష్రత్‌ భరూచాను వరించినట్లు సమాచారం. 'తాజ్‌ మహల్‌' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ నాయిక.. ‘ప్యార్‌ కా పంచనామా 2', 'డ్రీమ్‌ గర్ల్‌', 'సోను కే టిటు కి స్వీటీ'లాంటి విజయవంతమైన చిత్రాలతో ఉత్తరాది వాసులకు దగ్గరైంది. అందుకే నుష్రత్‌ నటనను మెచ్చే వినాయక్‌ 'ఛత్రపతి' రీమేక్‌కు ఆమెను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. చిత్రబృందం ఇప్పటికే ఆమెపై కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కించినట్లు ప్రచారం వినిపిస్తోంది. నుష్రత్‌ ప్రస్తుతం అక్షయ్‌ కుమార్‌తో కలిసి 'రామ్‌ సేతు'(ram setu movie cast)చిత్రంలో నటిస్తోంది.

ఇదీ చదవండి: Nani Next Movie: తెలంగాణ యాసలో హీరో నాని డైలాగులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.