ETV Bharat / sitara

'ఆర్​ఆర్​ఆర్'​, 'శ్యామ్​ సింగరాయ్​' నుంచి అప్డేట్స్​

author img

By

Published : Dec 23, 2021, 11:55 AM IST

ఆర్ఆర్​ఆర్
rrr songs

RRR movie: రామ్​చరణ్, ఎన్టీఆర్​ నటించిన భారీ బడ్జెట్​ చిత్రం 'ఆర్ఆర్​ఆర్​' నుంచి 'కొమురం భీముడో' పాట ప్రోమో విడుదలై ఆకట్టుకుంటోంది. ఇక నాని నటించిన 'శ్యామ్ సింగరాయ్​' నుంచి కూడా 'తార' అనే పాట విడుదలై అలరిస్తోంది.

RRR movie: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న మాగ్నమ్ ఒపస్​ 'ఆర్​ఆర్​ఆర్​' నుంచి కొత్త పాటకు సంబంధించిన ప్రోమో విడుదలైంది. 'కొమురం భీముడో' అంటూ సాగే ఈ పాట డిసెంబర్​ 24న విడుదలకానుంది. అల్లూరి సీతారామరాజుగా చరణ్, కొమరం భీమ్​గా ఎన్టీఆర్ నటించిన ఈ చిత్రం.. జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు. అజయ్ దేవ్​గణ్ కీలకపాత్ర పోషించారు. కీరవాణి సంగీతమందించారు. డీవీవీ దానయ్య రూ.450 కోట్లతో ఈ సినిమాను నిర్మించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న 'శ్యామ్‌ సింగరాయ్‌' నుంచి 'తార' అనే పాట విడుదలైంది. ఈ సినిమాకు రాహుల్‌ సాంకృత్యన్‌ దర్శకుడు. సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్‌ కథానాయికలు. ఈ సినిమా డిసెంబరు 24న విడుదలకానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: ధనుష్​ టాలీవుడ్​ ఎంట్రీ.. అదిరిపోయే టైటిల్​తో..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.