ETV Bharat / sitara

టాలీవుడ్​లో కొత్త జంటలు.. పెరుగుతున్న అంచనాలు

author img

By

Published : May 27, 2021, 8:01 AM IST

కొన్నిసార్లు స్టోరీ కంటే హీరోహీరోయిన్ల జోడీ కూడా సినిమాపై అంచనాల్ని పెంచుతోంది. ప్రస్తుతం టాలీవుడ్​లో తెరకెక్కుతున్న కొన్ని చిత్రాల్లో జోడీలు.. అభిమానుల్లో యమ క్రేజ్ సంపాదించాయి. ఇంతకీ వాళ్లెవరు? ఏయే సినిమాలు చేస్తున్నారు?

new pairs in telugu latest movies
పవన్ నిధి కృతిశెెట్టి రామ్

కొత్త కథలు.. కొత్త కాంబినేషన్​లే కాదు.. కొత్త జోడీలు సినీప్రియుల్ని అలరించేందుకు సిద్ధమవుతుంటాయి. విడుదలకు ముందే కావాల్సినంత క్రేజ్‌ తెచ్చిపెడుతుంటాయి. అగ్ర హీరో యువ హీరోయిన్లతో స్టెప్పులేసినా.. స్టార్‌ కథానాయిక యువ హీరోతో జోడీ కట్టినా, ప్రేక్షకుల దృష్టి ఆ చిత్రాలపైనే ఉంటుంది. త్వరలో రానున్న కొన్ని సినిమాల్లో ఇలాంటి క్రేజీ జంటల గురించే ఈ స్టోరీ.

పవన్‌తో.. తొలిసారి ఆ ముగ్గురు

పవర్​స్టార్ పవన్‌ కల్యాణ్‌ రీఎంట్రీలో వరుస సినిమాలతో పూర్తి బిజీగా మారిపోయారు. ప్రస్తుతం రెండు చిత్రాలు చేస్తున్నారు. క్రిష్ దర్శకత్వంలోని 'హరిహర వీరమల్లు'లో పవన్​.. ఇద్దరు కొత్త భామలతో నటిస్తున్నారు. నిధి అగర్వాల్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఆ ముద్దుగుమ్ములు. అలానే 'అయ్యప్పనుమ్ కోశియమ్' రీమేక్​లో నటిస్తున్న పవన్​కు జోడీగా నిత్యామేనన్ పేరు వినిపిస్తోంది.

pawan nithya menin nidhi agarwal
పవన్ నిధి అగర్వాల్ నిత్యామేనన్

అటు శ్రుతి.. ఇటు కృతి

'బాహుబలి' సిరీస్ తర్వాత పాన్ ఇండియా స్టార్​గా వరుస చిత్రాలు చేస్తున్నారు ప్రభాస్. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్'లో నటిస్తున్నారు. ఇందులో డార్లింగ్​కు జోడీగా శ్రుతిహాసన్ చేస్తోంది. వీరిద్దరూ కలిసి పనిచేయడం ఇదే తొలిసారి. దీంతో అంచనాలు అప్పుడే పెరిగిపోతున్నాయి. మరోవైపు 'ఆదిపురుష్‌'లో కృతి సనన్​తో కలిసి తెర పంచుకుంటున్నారు. నాగ్‌ అశ్విన్‌ తీస్తున్న సైన్స్‌ ఫిక్షన్‌ ప్రభాస్ సరసన దీపిక పదుకొణే సందడి చేయనుంది. వీటిలో 'సలార్‌' వచ్చే ఏడాది ఏప్రిల్‌ 14న.. 'ఆదిపురుష్‌' ఆగస్టు 11న విడుదల కానున్నాయి.

prabhas shruti haasan salaar
ప్రభాస్ శ్రుతిహాసన్

మాస్ మహారాజ్​తో కొత్త భామలు

'క్రాక్‌' విజయంతో హీరో రవితేజ హిట్‌ ట్రాక్‌ ఎక్కారు. ఈ జోష్‌లోనే 'ఖిలాడి'ని పూర్తిచేసే పనిలో పడ్డారు. దీని తర్వాత దర్శకుడు త్రినాథరావు నక్కినతో ఓ సినిమా చేయనున్నారు. ఇందులో మాస్ మహారాజ్ సరసన ఇద్దరు కొత్త భామలు ఉండనున్నారు. ఇందులో భాగంగా లవ్‌లీ సింగ్‌, ఐశ్వర్య మేనన్‌ పేర్లు వినిపిస్తున్నాయి.

raviteja lovely singh
రవితేజ- లవ్​లీ సింగ్

చైతూతో ముగ్గురు భామలు

అక్కినేని నాగచైతన్య హీరోగా విక్రమ్‌.కె.కుమార్‌ తీస్తున్న ప్రేమకథా సినిమా 'థాంక్యూ'. ఇందులో చైతూ సరసన ముగ్గురు కథానాయికలు ఆడిపాడనున్నారు. ఇప్పటికే రాశీఖన్నా ఖరారవగా.. మాళవికా నాయర్‌, ప్రియాంక మోహన్‌ పేర్లు మిగతా కథానాయిక పాత్రల కోసం వినిపిస్తున్నాయి.

maalavika priyanka mohan
మాళవిక నాయర్- ప్రియాంక మోహన్

నవీన్​తో అనుష్క

హీరోయిన్ ఓరియెంటడ్ సినిమాలతో మెప్పిస్తున్న అనుష్క.. ఇప్పుడు పంథా మార్చుతోంది. యువ దర్శకుడు మహేష్‌ తీస్తున్న సినిమా కోసం 'జాతిరత్నాలు' నవీన్​తో జోడీ కట్టనున్నట్లు తెలుస్తోంది. నలభై ఏళ్ల మహిళ వయసులో తన కన్నా చిన్నవాడైన కుర్రాడితో ప్రేమలో పడితే ఎలా ఉంటుంది? అన్నది ఈ చిత్రంలో వినోదాత్మకంగా చూపించనున్నారని సమాచారం.

anushka navin polishetty
అనుష్క - నవీన్ పోలిశెట్టి

ఇస్మార్ట్‌తో ఉప్పెన బ్యూటీ

'ఉప్పెన'తో తెలుగు తెరపై ఎగసిన కొత్త అందం కృతి శెట్టి. సుధీర్‌బాబు హీరోగా 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'లో ప్రస్తుతం నటిస్తోంది. మరోవైపు రామ్‌ - లింగు సామి కాంబోలో రూపొందుతున్న చిత్రంలోనూ నటిస్తోంది.

ram krithi shetty
రామ్ కృతిశెట్టి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.