ETV Bharat / sitara

NBK107: బాలకృష్ణ సినిమాలో ఆ నటికి లక్కీ ఛాన్స్

author img

By

Published : Jun 11, 2021, 1:51 PM IST

బాలకృష్ణ-గోపీచంద్ మలినేని కాంబినేషన్​లో తెరకెక్కే చిత్రంలో కీలక పాత్ర కోసం వరలక్ష్మి శరత్ కుమార్​ను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని చిత్రబృందం ప్రకటించింది.

Nandamuri Balakrishna new movie
బాలకృష్ణ

నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న సరికొత్త చిత్రంలో ప్రముఖ హీరోయిన్‌ చోటు దక్కించుకున్నారు. గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న ఈ సినిమాలో కథానాయిక వరలక్ష్మి శరత్‌కుమార్‌ ఓ కీలకపాత్రలో కనిపించనున్నట్లు చిత్రబృందం స్పష్టం చేసింది. ఈ విషయంపై వరలక్ష్మి స్పందిస్తూ.. "క్రాక్‌' తర్వాత నాకెంతో ఇష్టమైన దర్శకుడు గోపీచంద్‌ మలినేనితో కలిసి బాలయ్య సినిమా కోసం పనిచేయడం ఆనందంగా ఉంది. సెట్‌లోకి అడుగుపెట్టేందుకు ఎదురుచూస్తున్నాను' అని తెలిపారు.

Varalakshmi Sarathkumar on board for Nandamuri Balakrishna film
వరలక్ష్మి శరత్ కుమార్​

వాస్తవ సంఘటనలను ఆధారంగా చేసుకుని తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బాలయ్య ఫుల్‌ మాస్‌‌, పవర్‌ఫుల్‌ లుక్‌లో అలరించనున్నట్లు సమాచారం. తమన్‌ స్వరాలు అందించనున్నారు. మైత్రిమూవీ మేకర్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. గురువారం బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా NBK107 గురించి అధికారిక ప్రకటన విడుదలైంది. మరోవైపు ఈ ఏడాది విడుదలైన ‘క్రాక్‌’లో జయమ్మగా నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో వరలక్ష్మి అలరించి ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు కొట్టేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.