ETV Bharat / sitara

మహేశ్​బాబు​ సినిమాలో సాయిపల్లవి!

author img

By

Published : Jan 17, 2022, 7:21 PM IST

Maheshbabu Saipallavi movie: మహేశ్​బాబు నటించాల్సిన ఓ కొత్త సినిమాలో సాయిపల్లవిని తీసుకోవాలని చిత్రబృందం ఆలోచిస్తుందట! అయితే ఆ సినిమా ఏంటి? దర్శకుడు ఎవరో తెలుసుకుందాం..

mahesh babu saipallavi
మహేశ్​ సాయిపల్లవి

Maheshbabu Saipallavi movie: సూపర్​స్టార్​ మహేశ్​బాబు-హీరోయిన్​ సాయిపల్లవి కలిసి నటించనున్నారా అంటే అవుననే సినీవర్గాల నుంచి వినిపిస్తోంది. అయితే హీరోహీరోయిన్లుగా కాదండోయ్​ అన్నా చెల్లెలుగా అని సమాచారం అందుతోంది.

మహేశ్​-త్రివిక్రమ్​ కాంబోలో త్వరలోనే ఓ సినిమా తెరకెక్కనుందని కొంతకాలంగా ప్రచారం సాగుతోంది. ఈ మూవీ సిస్టర్​ సెంటిమెంట్​తో రూపొందనుందని తెలిసింది. చెల్లిలి పాత్రకు అధిక ప్రాధాన్యం ఉందట! అందుకే మహేశ్​కు సోదరిగా సాయిపల్లవిని తీసుకోవాలని చిత్రబృందం భావిస్తోందని తెలిసింది.

అయితే ఇదివరకు మెగాస్టార్​ చిరంజీవి 'భోళాశంకర్'​ చిత్రంలో చిరుకు సోదరిగా నటించే అవకాశాన్ని వదులుకుంది సాయిపల్లవి. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా వెల్లడించింది. మరి మహేశ్​కు చెల్లిలిగా ఒప్పుకుంటుందో లేదో వేచి చూడాలి.

ఇక ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్​గా నటించనుంది. మరో కథానాయికను ఎంపిక చేసే ప్రక్రియలో చిత్రబృందం ఉందని తెలిసింది. ఈ సినిమా రెగ్యులర్​ షూటింగ్​ ఏప్రిల్​ నుంచి ప్రారంభంకానుందట!

ఇదీ చూడండి: సెగలు పుట్టిస్తున్న హాలీవుడ్​ భామ పోజులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.