ETV Bharat / sitara

మిల్కీబ్యూటీనే బీట్​ చేసేలా చిందేసిన సితార!

author img

By

Published : Feb 14, 2020, 5:17 PM IST

Updated : Mar 1, 2020, 8:28 AM IST

Mahesh Babu Daughter Sitara Superb Dance on Dang Dang Song From sarileru nikevvaru
మిల్కీబ్యూటీనే బీట్​ చేసేలా చిందేసిన సితార

సూపర్​స్టార్​ మహేశ్​బాబు కుమార్తె సితార.. మిల్కీ బ్యూటీ తమన్నాను బీట్​ చేసేలా స్టెప్పులేసింది. 'సరిలేరు నీకెవ్వరు'లో డాంగ్​ డాంగ్​ అనే ఓ పార్టీ సాంగ్​కు చిందేసి ఆకట్టుకుంది.ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అవుతోంది.

సితార.. సూపర్​స్టార్​ మహేశ్​ బాబు గారాలపట్టి. ఇటీవల నిత్యం వార్తల్లో నిలుస్తోన్న ఈ చిన్నారి తాజాగా మిల్కీ బ్యూటీని బీట్​ చేసేలా స్టెప్పులేసింది. మహేశ్​ కథానాయకుడిగా నటించిన 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో తమన్నా డాంగ్​ డాంగ్​ అనే పాటకు తనదైన శైలిలో చిందేసి సినీప్రియుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. తాజాగా ఈ సాంగ్​కు సితార అదిరే స్టెప్పులేసింది. దీనికి సంబంధించిన ఓ వీడియోను నమ్రత ఇన్​స్టాలో పంచుకుంది. సితార డ్యాన్స్​ చూసిన నెటిజన్లు.. మిల్కీ బ్యూటీనే బీట్​ చేసేసింది అని కామెంట్లు పెడుతున్నారు.

సితార చాలా సందర్భాల్లో మహేశ్ నటించిన చిత్రాల్లోని పలు పాటలకు డ్యాన్స్‌ చేసి అందర్ని ఆకట్టుకుంది. ఆయా వీడియోలను నమ్రత సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఇటీవల హీ ఈజ్​ సో క్యూట్​, హీ ఈజ్​ సో స్వీట్​.. పాటకు డ్యాన్స్​ చేసి మెప్పించిన సితార.. దీపికా పదుకొణె నటించిన 'పద్మావత్​' సినిమాలోని గూమర్​ పాటకు.. 'బాహుబలి'లోని ఓ సాంగ్​కు డ్యాన్స్​ చేసి ఆకట్టుకుంది. ఇవే కాకుండా కొన్ని డైలాగులు చెబుతోంది ఈ చిన్నారి. వంశీ పైడిపల్లి కుమార్తె ఆద్యతో కలిసి సితార ఏఎండ్​ఎస్​ పేరుతో ఓ యూట్యూబ్​ ఛానెల్​ను నిర్వహిస్తోంది.

ఇదీ చదవండి:మోక్షజ్ఞ విదేశాలకు వెళ్లేది నటన కోసమేనా..?

Last Updated :Mar 1, 2020, 8:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.