ETV Bharat / sitara

సమంత కోసం రూ.3 కోట్ల హోటల్ సెట్

author img

By

Published : Feb 20, 2022, 4:48 PM IST

Updated : Feb 20, 2022, 7:07 PM IST

samantha
సమంత

Samantha Yasodha: సమంత 'యశోద' కోసం అదిరిపోయే రేంజ్​లో ఖర్చు చేస్తున్నారు. దాదాపు రూ.3 కోట్లు ఖర్చు చేసి 7 స్టార్ హోటల్​ సెట్​ను రూపొందించారు. ప్రస్తుతం ఇందులోనే షూటింగ్ జరుగుతోంది.

Samantha new movies: నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత.. ఫుల్​ బిజీగా మారిపోయింది. వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్తోంది. 'పుష్ప' సినిమాలో 'ఊ అంటవా..' సాంగ్​తో ఇటీవల సెన్సేషన్​ సృష్టించింది. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు లేడీ ఓరియెంటెడ్​ సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు అందులో ఓ సినిమాకు సంబంధించిన క్రేజీ న్యూస్ బయటకొచ్చింది.

ఇంతకీ విషయం ఏంటంటే?

సమంత.. 'యశోద' అనే సైంటిఫిక్ థ్రిల్లర్​లో నటిస్తోంది. పాన్ఇండియా కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలోని మూడో వంతు భాగాన్ని లగ్జరీ హోటల్​లో తీయాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో 35-40 రోజుల్లో బయట స్టార్ హోటల్స్​ తీయడం కష్టమైన విషయం! అందుకే దాదాపు రూ.3 కోట్లు ఖర్చు చేసి లగ్జరీ హోటల్​ సెట్​ను తీర్చిదిద్దారు. ఈ విషయాన్ని నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ వెల్లడించారు.

Samantha Yashoda movie
యశోద మూవీ సెట్

వరలక్ష్మి శరత్​కుమార్, ఉన్ని ముకుందన్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్న ఈ సినిమా షూటింగ్​ను ఏప్రిల్​ కల్లా పూర్తి చేస్తామని నిర్మాత చెప్పారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో వేసవిలో రిలీజ్​కు ప్లాన్ చేస్తున్నామని ఆయన అన్నారు. హరి- హరీశ్ దర్శక ద్వయం ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

Samantha Yashoda movie
యశోద మూవీ సెట్

ఇవీ చదవండి:

Last Updated :Feb 20, 2022, 7:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.