ETV Bharat / sitara

ఆ ఇద్దరి వల్లే నేనింకా బతికున్నా: సమంత

author img

By

Published : Jan 23, 2022, 5:35 AM IST

Samantha News: కథానాయిక సమంత విహారయాత్రల్లో బిజీగా ఉంది. ప్రస్తుతం స్విట్జర్లాండ్​లో ఎంజాయ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికరమైన పోస్ట్ చేసింది సామ్.

samantha
సమంత

Samantha News: ఇటీవల కాలంలో విహారయాత్రలు, సాహసయాత్రలు చేస్తూ ఆస్వాదిస్తోంది కథానాయిక సమంత. ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లో ఉన్న సామ్‌.. స్కీయింగ్‌ చేస్తూ హాలీడే ట్రిప్‌ను ఎంజాయ్‌ చేస్తోంది. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. "గతంలో ఎప్పుడూ ఇది ట్రై చేయలేదు. స్కీయింగ్‌ సాహసోపేతమైనది. అనుకోకుండా ఏదైనా జరిగితే ప్రాణాలను కోల్పోయే ప్రమాదమూ ఉంది. అయినా సరే విజయవంతంగా పూర్తి చేసి ప్రాణాలతో ఉన్నానంటే దానికి స్కీయింగ్ ట్రైనర్స్‌ కేట్‌, టోనెస్కి వల్లే" అంటూ థ్యాంక్స్‌ చెప్పింది.

samantha
సమంత పోస్ట్

సెలబ్రిటీలు, అభిమానులు సమంత అడ్వంచరస్‌ స్టంట్‌కి ఫిదా అవుతున్నారు. 'కమాన్‌ సామ్‌.. ఏదైనా స్కీయింగ్‌ పోటీల్లో పాల్గొని స్వర్ణ పతకం సాధించిరా' అంటూ సింగర్‌ చిన్మయ్‌ కామెంట్‌ చేశారు. కాగా సమంత.. గతంలో పారా సైక్లిస్టులతో కలిసి వర్షంలో 100 కి.మీ ఛాలెంజ్‌ను పూర్తి చేసింది. గోవాలో కయాకింగ్‌, అడవుల్లో ట్రెక్కింగ్‌ వంటి సాహసాలను హాలీడే ట్రిప్స్‌లో చేస్తుంటుంది. ఇక సినిమాల విషయానికొస్తే.. పాన్‌ ఇండియా చిత్రం 'యశోద' చిత్రీకరణ దశలో ఉండగా అంతర్జాతీయ సినిమా 'అరెంజ్‌మెంట్స్‌ ఆఫ్‌ లవ్‌'లోనూ ఆమె కీలకపాత్ర పోషిస్తోంది. గుణశేఖర్‌ దర్శకత్వంలో నటించిన 'శాకుంతలం' ఈ ఏడాది విడుదల కానుంది.

ఇదీ చదవండి:

సమంత ఐటెం సాంగ్‌కు బీటీఎస్‌ స్టెప్పులు.. వీడియో వైరల్

షాకింగ్​.. హీరోయిన్ సమంత ప్రెగ్నెంట్​! 'యశోద' కోసం!!

సమంత విడాకుల పోస్ట్ 'కనిపించడం' లేదు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.