ETV Bharat / sitara

Maa elections: 'పవన్​తో ఏకీభవించను.. ఆయన ఓటు మాత్రం నాకే'

author img

By

Published : Sep 28, 2021, 3:15 PM IST

Updated : Sep 28, 2021, 4:48 PM IST

maa elections
మా ఎన్నికలు

'మా'(Maa elections 2021) ఎన్నికల్లో మెగాస్టార్​ చిరంజీవి, పవర్​స్టార్​ పవన్​కల్యాణ్​ తనకెే ఓటు వేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు మంచు విష్ణు(Maa elections manchu vishnu panel). 'రిపబ్లిక్'​ ప్రీరిలీజ్​ ఈవెంట్​లో పవన్​ చేసిన వ్యాఖ్యలకు తాను ఏకీభవించట్లేదని అన్నారు.

తన మేనిఫెస్టో(Maa elections 2021) చూసిన తర్వాత చిరంజీవి, పవన్‌కల్యాణ్‌లు తనకే ఓటు వేస్తారని సినీ నటుడు, మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థి మంచు విష్ణు(Maa elections manchu vishnu panel) ధీమా వ్యక్తం చేశారు. 'మా' ఎన్నికల(maa elections schedule) నేపథ్యంలో పవన్‌కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవించడం లేదని అన్నారు. తాను తెలుగు చిత్ర పరిశ్రమవైపు ఉన్నానని, మరో అధ్యక్ష అభ్యర్థి ప్రకాశ్‌రాజ్‌ ఎటువైపు ఉన్నారో చెప్పాలని మంచు విష్ణు ప్రశ్నించారు. మంగళవారం ఆయన తన ప్యానెల్‌ సభ్యులతో కలిసి నామినేషన్స్‌ దాఖలు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.

విష్ణు

"ఇది తెలుగు సినీనటుల ఆత్మ గౌరవానికి సంబంధించిన అంశం. మా ఎన్నికల్లో జోక్యం చేసుకోవద్దని రాజకీయ పార్టీలకు నేను ముందే చెప్పా. కానీ, ఏం జరుగుతుందో అందరికీ తెలిసిందే. 'మా'లో ఉన్న 900మంది నాకు ఓటు వేసేందుకు సుముఖంగా ఉన్నారు. నా మేనిఫెస్టో చూసిన తర్వాత చిరంజీవిగారు, పవన్‌గారు వచ్చి నాకే ఓటు వేస్తారు. నాకు నమ్మకం ఉంది. నాన్నగారి గురించి పవన్‌కల్యాణ్‌(Pawankalyan mohanbabu fight) అడిగిన ప్రశ్నలకు ఆయనే సమాధానం ఇస్తారు. ఇప్పటికే ఈ విషయమై ఆయన ప్రకటన కూడా విడుదల చేశారు. 10వ తేదీ ఎన్నికలు అయిపోగానే 11వ తేదీ ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ మాట్లాడతారు."

"ఏపీ ప్రభుత్వ తీరుపై పవన్‌కల్యాణ్‌ మాట్లాడింది నేను పూర్తిగా వినలేదు. కొన్ని పాయింట్లు మాత్రమే చదివా. పవన్‌ ఇండస్ట్రీ కోసం మాట్లాడారు. ఆ వ్యాఖ్యలకు మాకూ ఎలాంటి సంబంధం లేదని తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌(telugu film industry chamber of commerce) ప్రకటన విడుదల చేసింది. తెలుగు ఫిల్మ్‌ ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ కూడా పవన్‌ వ్యాఖ్యలతో ఏకీభవించడం లేదు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు రెండు కళ్లు అని వాళ్లు ప్రకటించారు. నేను కూడా పవన్‌ వ్యాఖ్యలతో ఏకీభవించడం లేదు. తెలుగు ఇండస్ట్రీ బిడ్డగా, నిర్మాతగా, నటుడిగా ఫిల్మ్‌ ఛాంబర్‌ ఏ లేఖ ఇచ్చిందో దానితో ఏకీభవిస్తున్నా. నేను ఇంకో విషయం కూడా అడుగుతున్నా. ప్రకాశ్‌రాజ్‌గారు(Maa eletions prakash raj panel) తెలుగు ఇండస్ట్రీ పక్కన ఉన్నారా? లేక ఈ విషయంలో పవన్‌కల్యాణ్‌గారి పక్కన ఉన్నారా? అనేది కచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే ఫిల్మ్‌ ఇండస్ట్రీ మా జీవనాధారం. ఈ విషయాన్ని మీడియానే ప్రకాశ్‌రాజ్‌ను అడిగి చెప్పాలి."

"నిర్మాతలు దేవుళ్లు. వాళ్ల మాటకు నటులుగా మేము కట్టుబడి ఉండాలి. ప్రభుత్వాలతో మాట్లాడాల్సింది వాళ్లే. ఇండస్ట్రీలోని కొందరు పెద్దలు ఇప్పటికే చర్చలు ప్రారంభించారు. నిర్మాతలే ఆన్‌లైన్‌ టికెటింగ్‌ తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారని మంత్రి పేర్ని నాని చెప్పారు. ఒక మంత్రి అయి ఉండి, ఆయన అబద్ధాలు చెప్పరు కదా! అక్కడ సమావేశానికి వెళ్లిన ఇండస్ట్రీ ప్రతినిధులే దీనిపై మాట్లాడాలి. బండ్ల గణేశ్‌(Maa elections bandla ganesh) అంటున్నట్లు నన్నెవరూ నైట్‌ పార్టీలకు పిలవలేదు. నేను రాత్రి 9గంటలకే నిద్రపోతాను. ఇక తాయిలాలు ఇస్తున్నారని అంటున్నారు. నాకు కూడా ఎవరైనా గిఫ్ట్‌లు ఇస్తే బాగుంటుంది. బండ్ల గణేశ్‌ చెప్పినట్లు 'మా'లో ఉన్న సభ్యుల్లో కొంతమందికి తప్పకుండా ఇళ్ల అవసరం ఉంది" అని మంచు విష్ణు తెలిపారు.

ఇదీ చూడండి: MAA Elections 2021: 'మా' అధ్యక్ష పదవికి మంచు విష్ణు నామినేషన్

Last Updated :Sep 28, 2021, 4:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.