ETV Bharat / sitara

'ఖైదీ' దర్శకుడితో రామ్​చరణ్!

author img

By

Published : Jan 3, 2021, 4:48 PM IST

మెగా పవర్​స్టార్ రామ్​చరణ్ కొత్త చిత్రంపై టాలీవుడ్​లో గాసిప్స్ కొనసాగుతూనే ఉన్నాయి. ఈ హీరో లైనప్​లో చాలామంది దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి. తాజాగా 'ఖైదీ' ఫేమ్ లోకేశ్ కనగరాజ్​.. చరణ్​కు ఓ స్టోరీ చెప్పినట్లు తెలుస్తోంది.

Lokesh Kanagaraj to Direct Ram Charan
'ఖైదీ' దర్శకుడితో రామ్​చరణ్!

మెగా పవర్​స్టార్ రామ్​చరణ్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్'​ చిత్రంతో బిజీగా ఉన్నారు. దాని తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'ఆచార్య' షూటింగ్​లో పాల్గొంటారు. ఈ సినిమాల తర్వాత చరణ్ మరో కొత్త చిత్రం ఏంటనే సందేహాలు అభిమానుల్లో ఉన్నాయి. అయితే చరణ్ లైనప్​లో ఇప్పటికే చాలామంది దర్శకుల పేర్లు ఉన్నాయని పుకార్లు వినిపిస్తున్నాయి.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మరో యువ దర్శకుడి పేరు బలంగా వినిపిస్తోంది. అతడే కోలీవుడ్​కు చెందిన లోకేశ్ కనగ​రాజ్. 'ఖైదీ', 'మాస్టర్' సినిమాలతో తమిళంతో పాటు తెలుగులోనూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ దర్శకుడు చరణ్​కు ఇప్పటికే స్టోరీ లైన్ చెప్పారట. త్వరలోనే పూర్తి స్టోరీ చెబుతానని తెలిపారట. ప్రస్తుతం 'విక్రమ్' సినిమాతో బిజీగా ఉన్న లోకేశ్ అది పూర్తయ్యాక చరణ్​కు పూర్తి స్టోరీ చెప్పబోతున్నారని టాలీవుడ్. ఇదే నిజమైతే చరణ్ చేయబోయే కొత్త చిత్రం ఈ దర్శకుడితోనే అవుతుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.