ETV Bharat / sitara

ఓటీటీలో 'కురుప్' సినిమా.. సుశాంత్ 'చిచోరే' చైనాలో రిలీజ్

author img

By

Published : Dec 15, 2021, 4:01 PM IST

Updated : Dec 15, 2021, 7:24 PM IST

Cinema news: సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో కురుప్, చిచోరే, బ్రహ్మస్త్ర, హ్యాపీ బర్త్​డే చిత్రాల కొత్త సంగతులు ఉన్నాయి.

dulqar salman sushanth singh
దుల్కర్ సల్మాన్ సుశాంత్ సింగ్

Kurup OTT: దుల్కర్ సల్మాన్ 'కురుప్' సినిమా ఓటీటీలో అందుబాటులోకి వచ్చేసింది. నెట్​ఫ్లిక్స్​లో బుధవారం నుంచి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది.

kurup OTT
కురుప్ మూవీ

గ్యాంగ్​స్టర్ సుకుమార కురుప్​ బయోపిక్​ ఈ సినిమా. దుల్కర్ సరసన శోభిత దూళిపాళ్ల హీరోయిన్​గా నటించింది. శ్రీనాథ్ రాజేంద్రన్ దర్శకత్వం వహించారు. ఇందులో దుల్కర్​ డిఫరెంట్​ లుక్స్​ అభిమానుల్ని తెగ ఆకట్టుకున్నాయి.

Sushant singh rajput chhichhore: సుశాంత్ సింగ్ రాజ్​పుత్ 'చిచోరే'(2019) సినిమా చైనాలో విడుదలకు సిద్ధమైంది. జనవరి 7న దాదాపు 11 వేల థియేటర్లలో రిలీజ్ కానుందని చిత్రబృందం వెల్లడించింది.

chhichhore movie
చిచ్చోరే మూవీ

కాలేజీ నేపథ్యంగా తీసిన ఈ సినిమా మన ప్రేక్షకుల్ని విశేషంగా అలరించింది. ఇందులో తెలుగు నటుడు నవీన్ పోలిశెట్టి కూడా కీలకపాత్రలో కనిపించి మెప్పించడం విశేషం. నితీష్ తివారీ దర్శకత్వం వహించారు.

Brahmastra release date: మూడు భాగాలుగా తెరకెక్కుతున్న 'బ్రహ్మస్త్ర' రిలీజ్​ తేదీని ప్రకటించారు. తొలి పార్ట్​ను వచ్చే ఏడాది సెప్టెంబరు 9 థియేటర్లలో విడుదల చేస్తామని తెలిపారు. దీనితో పాటే మోషన్​ పోస్టర్​ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల్ని అలరించనుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">
Brahmastra release date
బ్రహ్మాస్త్ర షూటింగ్​లో రణ్​బీర్ కపూర్-ఆలియా భట్

ఇందులో రణ్​బీర్ కపూర్​, ఆలియా భట్ ప్రధాన పాత్రలు పోషించారు. అమితాబ్ బచ్చన్, నాగార్జున తదితరులు కీలకపాత్రలు పోషించారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు.

*లావణ్య త్రిపాఠి పుట్టినరోజు సందర్భంగా ఆమె కొత్త సినిమా పోస్టర్​ను రిలీజ్ చేశారు. మోడ్రన్​ డ్రస్​లో మెషీన్ గన్​ ఫైర్​ చేస్తున్న ఆమె లుక్​ కేక పుట్టిస్తుంది.

lavanya tripathi happy birthday movie
హ్యాపీ బర్త్​డే మూవీలో లావణ్య త్రిపాఠి

ఈ సినిమాకు 'హ్యాపీ బర్త్​డే' అనే టైటిల్​ను ఖరారు చేశారు. 'మత్తు వదలరా' ఫేమ్ రితేష్​ రానా దర్శకత్వం వహిస్తున్నారు. క్లాప్ ఎంటర్​టైన్​మెంట్స్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఇవీ చదవండి:

Last Updated :Dec 15, 2021, 7:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.