ETV Bharat / sitara

'క్రాక్'​ దర్శకుడితో బాలకృష్ణ సినిమా!

author img

By

Published : Jan 12, 2021, 5:45 PM IST

Updated : Jan 12, 2021, 6:57 PM IST

'క్రాక్​' చిత్రంతో హిట్​ అందుకున్న దర్శకుడు గోపీచంద్​ మలినేని.. తన తర్వాతి చిత్రాన్ని బాలకృష్ణతో తెరకెక్కించనున్నారని సమాచారం. ఇటీవలే ఈ దర్శకుడి చెప్పిన కథను విన్న బాలయ్య.. ఫుల్​స్క్రిప్ట్​ను సిద్ధం చేయమని చెప్పినట్లు టాలీవుడ్​లో ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే ఈ వేసవిలో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుందని తెలుస్తోంది.

bala
బాల

మాస్ మ‌హారాజ్​ ర‌వితేజ‌, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేష‌న్‌లో తెరకెక్కిన 'క్రాక్‌' చిత్రం.. సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీసు వద్ద కలెక్షన్లను కొల్లగొడుతోంది. ఈ విజయంతో గోపీచంద్​ మలినేనికి డిమాండ్​ అమాంతంగా పెరిగిపోయింది. ఈ దర్శకుడితో సినిమా చేయాలని పలువురు యంగ్​ హీరోలు ఆసక్తి చూపుతున్నట్లు టాలీవుడ్​ వర్గాలు అంటున్నాయి.

అయితే ఈ దర్శకుడు తన తదుపరి సినిమాను హీరో నందమూరి బాలకృష్ణతో చేసే ప్రయత్నాల్లో ఉన్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే బాలయ్యకు కథ వినిపించారని, త్వరలోనే ఫుల్​స్క్రిప్ట్‌ సిద్ధం చేయనున్నారని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్‌ సంస్థలో నిర్మించనున్నారని సమాచారం. త్వరలోనే దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశముంది.

ఇదీ చూడండి : రివ్యూ: 'క్రాక్​'తో మాస్​ మహారాజ్​ ఫామ్​లోకి వచ్చాడా?

Last Updated : Jan 12, 2021, 6:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.