ETV Bharat / sitara

అందుకే 'కొండపొలం' సినిమా చేశాం: క్రిష్​

author img

By

Published : Oct 6, 2021, 6:51 AM IST

తెలుగువారు గర్వపడేలా 'కొండపొలం'(Kondapolam movie) సినిమా తెరకెక్కించినట్లు తెలిపారు దర్శకుడు క్రిష్​. ఈ చిత్రం హీరో వైష్ణవ్​ను మరో మెట్టు ఎక్కించిందని అన్నారు.

kondapolam
కొండపొలం

"సినిమాకి(kondapolam movie release date) కావల్సిన ప్రథమ ముడిపదార్థం కథ. మనకున్నన్ని కథలు ఎక్కడా లేవు. కానీ గొప్ప కథలు రావడం లేదని దర్శకులమంతా కూర్చుని ఆలోచించాం. అప్పుడు రచయితలకి పారితోషికం, పేరు, గౌరవం, ఆహ్వానించే తీరు గురించి చాలా అనుకున్నాం. రచయితను ఉన్నత స్థానంలో ఉంచాలని కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. అందులో మొదటి భాగంగా... మా దర్శకులందరి నుంచీ మేం చేసిన తొలి ప్రయత్నమే ఈ సినిమా" అని అన్నారు దర్శకుడు క్రిష్‌(kondapolam movie director). ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'కొండపొలం'. వైష్ణవ్‌తేజ్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌(vaishnav tej rakul preet singh) జంటగా నటించారు. సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్‌రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. కీరవాణి స్వరకర్త. ఈ చిత్రం ఈ నెల 8న ప్రేక్షకుల ముందుకొస్తోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో ముందస్తు విడుదల వేడుక జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన హరీష్‌శంకర్‌ మాట్లాడుతూ "చాలా కాలమైంది ఒక నవలా రచయిత పేరు సినిమా పోస్టర్‌పై చూసి. సాహిత్యాన్ని ముత్యాల్లాగా తలపై పెట్టుకుని పరిశ్రమకి తీసుకొస్తాడు క్రిష్‌. తన సినిమా వస్తుందంటే తెలియని ఆసక్తి నెలకొంటుంది" అన్నారు.

క్రిష్‌(kondapolam movie director) మాట్లాడుతూ "ఈ సినిమా విజయం అనేది తెలుగు సాహిత్యానికి, తెలుగు సినిమాకి, సమాజానికి అవసరం. తెలుగు దర్శకుడిగా చెబుతున్నా... తెలుగువారు గర్వపడేలా చేశా. వైష్ణవ్‌ను 'ఉప్పెన'తో ఒక మెట్టు ఎక్కించాడు దర్శకుడు బుచ్చిబాబు. దానికి పైమెట్టు నేను ఈ సినిమాతో ఎక్కించా. రకుల్‌ పక్కాగా యాస పలుకుతూ, అడవంత గొప్పదైన ఓబు పాత్రలో నటించింది" అన్నారు.

రకుల్‌ప్రీత్‌ సింగ్‌(vaishnav tej rakul preet singh) మాట్లాడుతూ "ఒక సంతృప్తినిచ్చిన పాత్ర ఓబులమ్మ. ప్రేక్షకులకూ అంతే నచ్చుతుంద"న్నారు. వైష్ణవ్‌తేజ్‌ మాట్లాడుతూ "అడవి ఓ పెద్ద బాలశిక్ష అనే ఓ సంభాషణ ఉంటుంది. 'ఉప్పెన' నాకు తొలి అధ్యాయమైతే, ఈ సినిమా రెండో అధ్యాయం. ఎన్నిసార్లు పడినా మళ్లీ లేచి నిలబడాలనేంత స్ఫూర్తిని అందరిలోనూ రలిగిస్తుందీ చిత్రం" అన్నారు వైష్ణవ్‌తేజ్‌.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

దర్శకుడు బుచ్చిబాబు సానా మాట్లాడుతూ "క్రిష్‌ నుంచి విలువలతో కూడిన సినిమాలొస్తాయి. ప్రతి సినిమాతోనూ ఓ పాఠం నేర్పుతుంటారు" అన్నారు. గీత రచయిత చంద్రబోస్‌ మాట్లాడుతూ "ఒక గొప్ప నవలని తెరపైకి తీసుకొచ్చిన క్రిష్‌కు అభినందనలు. సన్నపురెడ్డి చిక్కటి వచనం రాశారు. నేను రెండు పాటలు రాశా" అన్నారు. సాయిచంద్‌, సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి, హేమ, మహేశ్‌ విట్టా, రచ్చరవి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: ఆ పాత్రలో నటించడం మరిచిపోలేని అనుభూతి: రకుల్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.