ETV Bharat / sitara

గ్రామీ అవార్డుపై ప్రముఖ ర్యాపర్​​ మూత్ర విసర్జన

author img

By

Published : Sep 17, 2020, 7:26 PM IST

గ్రామీ అవార్డుపై మూత్ర విసర్జన చేస్తున్న వీడియోను పోస్ట్ చేశాడు ర్యాపర్ కేన్. తన ఆల్బమ్స్​పై హక్కుల విషయపై ప్రముఖ మ్యూజిక్​ కంపెనీల​తో వివాదం జరుగుతున్న నేపథ్యంలో ఈ పని చేసినట్లు వెల్లడించాడు.

Kanye
కేన్​ వెస్ట్

అమెరికన్​ ప్రముఖ ర్యాపర్​ కేన్​ వెస్ట్​ ట్వీట్ చేసిన ఓ వీడియో వైరల్​గా మారింది. ఇందులో భాగంగా ప్రతిష్ఠాత్మక గ్రామీ అవార్డుపై మూత్ర విసర్జన చేస్తున్నారు. తన పాటలకు సంబంధించిన​ హక్కుల విషయమై సంగీత​ కంపెనీలు సోనీ, యూనివర్సల్​తో వివాదం జరుగుతుందని తెలిపాడు. యూనివర్సల్​ సంస్థతో పది ఆల్బమ్స్​కు ఒప్పందం కుదుర్చుకున్నానని, కానీ అందులో అవకతవకలు జరిగినట్లు వెల్లడించాడు. అందుకే ఈ చర్యకు పాల్పడినట్లు తెలిపాడు.

సదరు కంపెనీలను విమర్శిస్తూ పలు ట్వీట్లు కూడా చేశాడు కేన్​. తనకు న్యాయం జరిగేవరకు ఊరుకోనని చెప్పాడు. ప్రపంచంలో ఉన్న న్యాయవాదులు తన సమస్యకు పరిష్కారం చూపాలని కోరాడు.

ఇదీ చూడండి అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో ర్యాపర్ కేన్​ వెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.