ETV Bharat / sitara

'ఆర్​ఆర్​ఆర్' సెట్లో వాలీబాల్​ ఆడిన తారక్​.. వీడియో వైరల్!

author img

By

Published : Jul 29, 2021, 3:51 PM IST

Updated : Jul 29, 2021, 4:45 PM IST

నిర్విరామంగా జరుగుతోన్న 'ఆర్​ఆర్​ఆర్​' చిత్రీకరణ నుంచి కథానాయకుడు ఎన్టీఆర్​, దర్శకుడు రాజమౌళి చిన్న బ్రేక్​ తీసుకున్నారు. ఒత్తిడిని తగ్గించుకునేందుకు సెట్లోని కొంతమందితో కలిసి వీరిద్దరూ వాలీబాల్​ ఆడారు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్​గా మారింది.

Jr NTR and SS Rajamouli play volleyball with RRR team on sets
'ఆర్​ఆర్​ఆర్' సెట్లో వాలీబాల్​ ఆడుతున్న తారక్​, జక్కన్న!

సినిమా తెరకెక్కించడమనేది సాధారణ విషయం కాదు. అందులోనూ భారీ బడ్జెట్‌, పాన్‌ ఇండియా సినిమా అయితే.. దర్శకుడు, నటీనటులపై ఉండే ఒత్తిడి మాటల్లో చెప్పలేం. అదేవిధంగా పని ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు 'ఆర్‌ఆర్‌ఆర్‌' టీమ్‌. తారక్‌-రామ్‌చరణ్‌ ప్రధాన పాత్రల్లో రాజమౌళి తెరకెక్కిస్తోన్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్‌'(రణం రౌద్రం రుధిరం). భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం ప్రేక్షకులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూట్‌ చివరిదశలో ఉంది.

అయితే, నిర్విరామంగా జరుగుతున్న ఈ సినిమా షూట్‌ నుంచి తారక్‌-రాజమౌళి చిన్న బ్రేక్‌ తీసుకుని.. ఇతర బృందంతో కలిసి సరదాగా వాలీబాల్‌ ఆడారు. తారక్‌-జక్కన్న వేర్వేరు టీమ్‌లుగా విడిపోయి ఈ ఆటలో పాల్గొన్నారు. తారక్‌ టీమ్‌లో కీరవాణి కుమారుడు కాలభైరవ, జక్కన్న కుమారుడు కార్తికేయ ఉన్నారు. దీనికి సంబంధించి ఓ వీడియో బయటకు నెట్టింట్లో వైరల్‌గా మారింది.

Jr NTR and SS Rajamouli play volleyball with RRR team on sets
వాలీబాల్​ ఆడుతున్న ఎన్టీఆర్​, రాజమౌళి

అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌, కొమురంభీమ్‌గా తారక్‌ 'ఆర్‌ఆర్‌ఆర్‌'లో కనిపించనున్నారు. బాలీవుడ్‌, హాలీవుడ్‌ తారలు ఇందులో కీలకపాత్రలు పోషిస్తున్నారు. చెర్రీ సరసన ఆలియాభట్‌, ఎన్టీఆర్‌ సరసన ఒలీవియా మోరీస్‌ సందడి చేయనున్నారు. అజయ్ దేవ్‌గణ్‌, శ్రియ, సముద్రఖని కీలకపాత్రల్లో కనిపించనున్నారు. సుమారు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రానికి డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు, ఇటీవల విడుదలైన 'ఆర్‌ఆర్‌ఆర్‌' మేకింగ్‌ వీడియో సినిమాపై అంచనాలను భారీగా పెంచింది.

ఇదీ చూడండి.. రాజమౌళికి జక్కన్న అనే పేరు పెట్టింది ఎవరో తెలుసా?

Last Updated : Jul 29, 2021, 4:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.