ETV Bharat / sitara

'భీమ్లా' గ్రాండ్​ పార్టీ​.. విజయ్​ కొత్త సినిమా అప్డేట్​.. శ్రుతికి కరోనా

author img

By

Published : Feb 27, 2022, 1:02 PM IST

Updated : Feb 27, 2022, 1:09 PM IST

మరి కొన్ని చిత్రాల అప్డేట్స్​ వచ్చాయి. ఇందులో విజయ్​ దేవరకొండ, పవన్​కల్యాణ్​ చిత్రాల సంగతులు ఉన్నాయి. కాగా, హీరోయిన్​కు శ్రుతిహాసన్​కు కరోనా సోకింది.

Shrutihassan corona positive
Shrutihassan corona positive

Bheemlanayak collections: పవన్​కల్యాణ్​​ 'భీమ్లానాయక్' రెండో రోజు జోరు కొనసాగిస్తోంది. నైజాంలో శుక్రవారం 11.80కోట్లు సాధించగా శనివారం రూ.7.5కోట్లు వసూలు చేసినట్లు తెలిసింది. బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లతో బ్లాక్‌బస్టర్‌ విజయం అందుకున్న నేపథ్యంలో చిత్రబృందం.. సక్సెస్‌ని ఎంజాయ్‌ చేస్తోంది. తమకు ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులందరికీ థ్యాంక్స్‌ చెబుతూ శనివారం ఉదయం టీమ్‌ మొత్తం ప్రెస్‌మీట్‌ నిర్వహించింది. కాగా, నిన్న సాయంత్రం ‘భీమ్లానాయక్‌’ టీమ్‌ మొత్తానికి పవన్‌ కల్యాణ్‌, త్రివిక్రమ్‌ కలిసి ఓ గ్రాండ్‌ పార్టీ ఇచ్చినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఈ పార్టీలో ఈ సినిమా కోసం పనిచేసిన నటీనటులు, టెక్నీషియన్స్‌, సింగర్స్‌ అందరూ పాల్గొన్నారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.​ కాగా, సాగర్​ కె చంద్ర తెరకెక్కించిన ఈ చిత్రంలో రానా, నిత్యామేనన్​, సంయుక్తా మేనన్​ కీలక పాత్రలు పోషించారు.

bheem
పవన్​, తమన్​
bheem
భీమ్లానాయక్​

Shrutihassan corona: స్టార్​ హీరోయిన్​ శ్రుతిహాసన్​కు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆమె ఇన్​స్టాలో పోస్ట్​ చేసింది. "నేను ఇస్తున్న ఈ అప్డేట్​ సరదా కోసం కాదు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ నాకు కరోనా పాజిటివ్​గా తేలింది. ప్రస్తుతం నా ఆరోగ్యం బాగానే ఉంది. తిరిగి ఎప్పటిలాగే నా పనుల్లో పాల్గొనాలని చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నా. మీ అందరినీ త్వరలోనే మళ్లీ కలుస్తాను" అని శ్రుతి పేర్కొంది. ప్రస్తుతం ఆమె ప్రభాస్​ 'సలార్'​, బాలయ్య 107వ సినిమా సహా పలు చిత్రాల్లో నటిస్తోంది. ఇటీవలే శ్రుతి తండ్రి, దిగ్గజ నటుడు కమల్​హాసన్​ కొవిడ్​ నుంచి కోలుకున్నారు.

Vijaydevarkonda purijagannadh: ప్రస్తుతం దర్శకుడు పూరీ జగన్నాథ్​-హీరో విజయ్​ దేవరకొండ కలిసి 'లైగర్'​ సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత వీరిద్దరి కాంబోలో 'జనగణమన' సినిమా తెరెకెక్కనుందని కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. ఈ సినిమాకు సంబంధించిన అధికార ప్రకటన రాకపోయినప్పటికీ ఏప్రిల్​ నుంచి షూటింగ్​ ప్రారంభంకానుందని తెలిసింది. కాగా, విజయ్ సరసన కియారా అద్వాణీ నటించనుందని ఇప్పటివరకు వినిపించింది. అయితే ఇప్పుడు ఆమె స్థానంలో జాన్వీ కపూర్​ను తీసుకోవాలని చిత్రబృందం యోచిస్తోందట. చర్చలు జరుగుతున్నాయట!

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి:

చిరు 'భోళాశంకర్​' అప్డేట్​.. 'అరబిక్​ కుతు', 'కళావతి' సాంగ్స్​ రికార్డు!

Bheemla nayak collections: తొలిరోజు కలెక్షన్లలో 'భీమ్లా నాయక్' హవా

Last Updated :Feb 27, 2022, 1:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.