ETV Bharat / sitara

'హీరో' ఓటీటీ రిలీజ్ డేట్.. 'ఎఫ్ 3' సినిమా కొత్త అప్డేట్

author img

By

Published : Feb 2, 2022, 7:28 PM IST

movie news
మూవీ న్యూస్

Cinema news: సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో హీరో, ఎఫ్ 3, పక్కా కమర్షియల్, రంగరంగ వైభవంగా, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, బ్లేడ్ బాబ్జీ, శేఖర్ చిత్రాల కొత్త సంగతులు ఉన్నాయి.

Hero OTT release date: ఈ సంక్రాంతికి థియేటర్లలోకి వచ్చిన 'హీరో'.. ఓటీటీ రిలీజ్​కు సిద్ధమైంది. ఫిబ్రవరి 11 నుంచి డిస్నీ ప్లస్ హాట్​స్టార్​లో స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలోనే బుధవారం, రిలీజ్ పోస్టర్​ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

hero movie OTT
హీరో మూవీ

ఈ సినిమాతో మహేశ్​బాబు మేనల్లుడు అశోక్ హీరోగా పరిచయమయ్యారు. నిధి అగర్వాల్ హీరోయిన్​గా నటించింది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించారు.

F3 movie: 'ఎఫ్3' మూవీ కొత్త అప్డేట్​కు టైమ్ ఫిక్సయింది. గురువారం ఉదయం 10:08 గంటలకు ఎక్స్​ట్రా ఎంటర్​టైన్​మెంట్​ అప్డేట్​ రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు.

F3 movie
ఎఫ్ 3 మూవీ

'ఎఫ్ 2' సినిమాకు సీక్వెల్​గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వెంకటేశ్, వరుణ్​తేజ్​తో పాటు సునీల్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా చేస్తున్నారు. సోనాల్ చౌహాన్ ప్రత్యేక పాత్రలో నటించింది. అనిల్ రావిపూడి హీరోయిన్. దిల్​రాజు నిర్మాతగా వ్యవహరించారు.

Gopichand pakka commercila movie: గోపీచంద్ 'పక్కా కమర్షియల్' సినిమాలోని 'పక్కా కమర్షియల్' టైటిల్​ సాంగ్ రిలీజైంది. కామెడీ ఎంటర్​టైనర్​గా తెరకెక్కుతున్న ఈసినిమాలో రాశీఖన్నా హీరోయిన్​. మారుతి దర్శకత్వం వహించారు. జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించాయి. మే 20న సినిమా థియేటర్లలోకి రానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

వైష్ణవ్​తేజ్, కేతికశర్మ హీరోహీరోయిన్లుగా నటించిన కొత్త సినిమా 'రంగరంగ వైభవంగా'. ఈ చిత్రంలోని తెలుసా తెలుసా పాట ప్రోమో రిలీజైంది. పూర్తి లిరికల్ సాంగ్.. ఫిబ్రవరి 3న విడుదల కానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">
.
.
degala babji movie
బండ్ల గణేశ్ 'డేగల బాబ్జీ' మూవీ
.
.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.