ETV Bharat / sitara

పసుపు దుస్తుల్లో 'చందమామ'లా మెరిసిన కాజల్​

author img

By

Published : Oct 29, 2020, 7:40 PM IST

స్టార్ హీరోయిన్​ కాజల్​ అగర్వాల్​ పెళ్లిసందడి మొదలైంది. నటి కాజల్​ తన స్నేహితుడు, వ్యాపారవేత్త అయిన గౌతమ్​ కిచ్లును శుక్రవారం వివాహమాడానున్నారు. ఈ సందర్భంగా ఆమె ఇంట 'పసుపు కొట్టే వేడుక'కు సంబంధించిన ఫొటోలు సోషల్​మీడియాలో వైరల్​గా మారాయి.

haldi ceremony at Kajal Aggarwal house
పసుపు దుస్తుల్లో 'చందమామ'లా మెరిసిపోతున్న కాజల్​

కథానాయిక కాజల్‌ పెళ్లి ముహూర్తం దగ్గరపడింది. తన స్నేహితుడు, వ్యాపారవేత్త గౌతమ్‌ కిచ్లును అక్టోబరు 30న వివాహం చేసుకోనున్నారు. ఈ సందర్భంగా ఇప్పటికే పెళ్లి కార్యక్రమాలు సందడిగా సాగుతున్నాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

haldi ceremony at Kajal Aggarwal house
'చందమామ'లా మెరిసిపోతున్న కాజల్​

కాజల్‌ ఇంట 'పసుపు కొట్టే వేడుక' సందడిగా జరిగింది. పసుపు వర్ణ దుస్తులు, పూల ఆభరణాలతో కాజల్‌ 'చందమామ'లా మెరిసిపోయారు. అంతేకాదు, కుటుంబ సభ్యులతో కలిసి డ్యాన్స్‌ చేశారు. కాజల్‌ సోదరి నిషా అగర్వాల్‌ తమ ఇంట్లో పనిచేసేవారికి బహుమతులు అందించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

haldi ceremony at Kajal Aggarwal house
'చందమామ'లా మెరిసిపోతున్న కాజల్​
haldi ceremony at Kajal Aggarwal house
'చందమామ'లా మెరిసిపోతున్న కాజల్​
haldi ceremony at Kajal Aggarwal house
'చందమామ'లా మెరిసిపోతున్న కాజల్​
haldi ceremony at Kajal Aggarwal house
'చందమామ'లా మెరిసిపోతున్న కాజల్​
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.