ETV Bharat / sitara

డబుల్ ఫన్​తో 'ఎఫ్​3'.. షూటింగ్​ షురూ

author img

By

Published : Dec 17, 2020, 1:29 PM IST

F3 shooting started and producer allu aravind came as specail guest to the event
ఈసారి మోర్​ ఫన్​తో 'ఎఫ్​3'.. షూటింగ్​ షురూ

విక్టరీ వెంకటేష్​, వరుణ్​ తేజ్ ప్రధాన పాత్రల్లో మరోసారి కనువిందు చేయనున్న హాస్యప్రధాన చిత్రం 'ఎఫ్3​'. ఈ సినిమా షూటింగ్​ గురువారం ప్రారంభమైంది. అల్లు అరవింద్​​ ప్రత్యేక అతిథిగా హాజరై క్లాప్​ కొట్టారు.

ప్రేక్షకులను మరోసారి 'ఫన్​'లో ముంచెత్తడానికి దర్శకుడు అనిల్​ రావిపూడి సిద్ధమయ్యారు. విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్​ ప్రధాన పాత్రల్లో ఆయన తెరకెక్కిస్తున్న చిత్రం 'ఎఫ్3'. ఈ సినిమా షూటింగ్​ పూజా కార్యక్రమాలతో గురువారం లాంఛనంగా ప్రారంభమైంది. ​ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్..​ క్లాప్​ కొట్టారు. డిసెంబర్​ 23 నుంచి రెగ్యులర్​ షూటింగ్​ జరుపుకోనుంది.

F3 shooting started and producer allu aravind came as specail guest to the event
వరుణ్​ తేజ్​, తమన్నాలపై క్లాప్​ కొడుతున్న నిర్మాత అల్లు అరవింద్​
F3 shooting started and producer allu aravind came as specail guest to the event
'ఎఫ్​3' చిత్రబృందం

గతేడాది సంక్రాంతికి విడుదలై బాక్సాఫీస్​ వద్ద ఘనవిజయాన్ని నమోదు చేసుకున్న 'ఎఫ్2' చిత్రానికి కొనసాగింపుగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ​దిల్​రాజు నిర్మిస్తుండగా.. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. 'ఫన్, ఫ్రస్టేషన్, మోర్ ఫన్​' అనే క్యాప్షన్​తో ఈ సినిమా పోస్టర్​ను ఇటీవలే విడుదల చేసింది చిత్రబృందం.

ఇదీ చూడండి:'ఎఫ్ 3' సందడి మొదలైంది.. నవ్వుకోవడానికి సిద్ధమా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.