ETV Bharat / sitara

'భాష ఏదైనా.. పాత్రకు న్యాయం చేయడమే ముఖ్యం'

author img

By

Published : Jun 9, 2019, 1:01 PM IST

ధనుష్​

"ఏ భాషలో నటిస్తున్నామన్నది కాదు.. పాత్రకు ఎంత న్యాయం చేశామన్నదే ముఖ్యం" అని చెప్పాడు తమిళ మెగాస్టార్​ ధనుష్​. తాను చేసే ఏ సినిమా కోసమైనా 100శాతం కష్టపడతానని అన్నాడు. ధనుష్​ హీరోగా నటించిన హాలీవుడ్ చిత్రం 'ద ఎక్స్​ట్రార్డినరీ జర్నీ ఆఫ్​ ఫకీర్​' సినిమా ఈ నెల 21న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తన అనుభవాలను, అభిప్రాయాలను ఈటీవీ భారత్​ ప్రత్యేక ముఖాముఖిలో వెల్లడించాడు.

ధనుష్​తో ఈటీవీ భారత్ ప్రత్యేక ఇంటర్వ్యూ

'వైదిస్​ కొలవెరీ దీ' అంటూ దేశాన్ని ఊపేసిన ధనుష్​.. తమిళంలో ఎన్నో హిట్​లు అందుకున్నాడు. బాలీవుడ్​లోనూ రాంఝానా సినిమాతో అదరగొట్టాడు. హాలీవుడ్​లోనూ తన మార్క్​ను చూపించేందుకు సిద్ధమయ్యాడు. అతడు హీరోగా నటించిన 'ద ఎక్స్​ట్రార్డినరీ జర్నీ ఆఫ్​ ఫకీర్' జూన్​ 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా హాలీవుడ్​ సినిమా చిత్రీకరణలో తన అనుభవాలను, అభిప్రాయాలను ఈటీవీ భారత్​ ప్రత్యేక ఇంటర్వ్యూలో పంచుకున్నాడు ధనుష్​.

ద ఎక్స్​ట్రార్డినరీ జర్నీ ఆఫ్​ ఫకీర్ సినిమాలోని తన పాత్రకు 100శాతం న్యాయం చేశానని ధనుష్​ చెప్పాడు. ఏ భాషలో నటించామని కాదని, పాత్రకు ఎంత న్యాయం చేశామన్నదే ముఖ్యమని అన్నాడు.

"తమిళం, హిందీ, ఇంగ్లిషు... ఏ భాషలో నటించినా అన్నీ నాకు ఒకటే. నా పని నేను చేస్తా. నేను అన్నీ ఒకటేనని భావిస్తా. పాత్రకు న్యాయం చేయడమే నాకు ముఖ్యం. నేను ఆ పని చేశానని అనుకుంటున్నా."
- ధనుష్​, హీరో

ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నటులు, సాంకేతిక నిపుణులతో పని చేయడం వల్ల చాలా విషయాలు, అంశాలు నేర్చుకునే అవకాశం కలిగిందని చెప్పాడు ధనుష్​.

"చాలా ప్రయాణాలు చేశాం. ప్రపంచ నలుమూలల నుంచి వచ్చిన సినీ పరిశ్రమల వారిని, నటులను కలిశాం. చాలా అంశాలు నేర్చుకునే అవకాశం కలిగింది. నటులు, సాంకేతిక నిపుణుల నుంచి కొత్త విషయాలను నేర్చుకుంటూ చాలా ఎంజాయ్​ చేశాం." - ధనుష్​, హీరో

తన సరసన హాలీవుడ్​ చిత్రంలో నటించిన హీరోయిన్ బెర్​నీస్​ బెజో అద్భుత నటి అంటూ ప్రశంసించాడు ధనుష్​.

"ఆమె చాలా మంచివారు. చాలా సహకరించారు. తన పాత్రను ఎంతో సునాయాసంగా చేశారు. ఆమెతో నటించడం వల్ల చాలా విషయాలు నేర్చుకున్నా." - ధనుష్​, హీరో

తనతో రాంఝనాను తెరకెక్కించిన బాలీవుడ్ దర్శకుడు ఆనంద్​ ఎల్​ రాయ్​తో మరో సినిమాను త్వరలో చేయనున్నట్టు ధ్రువీకరించాడు ధనుష్​.

"ఇది నిజమే. త్వరలో ఆనంద్ రాయ్​తో సినిమా చేయబోతున్నా. ఎప్పుడు, ఎలా అనే విషయాలు ఇంకా అనుకోలేదు." - ధనుష్​, హీరో

AP Video Delivery Log - 0300 GMT News
Sunday, 9 June, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0253: Mexico Migrants AP Clients Only 4214898
Concern in Ciudad Hidalgo over US tariff deal
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.