ETV Bharat / sitara

బాలీవుడ్​లో చాలా ఆఫర్స్ వచ్చాయి.. కానీ: అల్లు అర్జున్

author img

By

Published : Dec 16, 2021, 7:25 PM IST

హిందీలో నేరుగా సినిమా చేయడంపై అగ్రకథానాయకుడు అల్లు అర్జున్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. అది తన కెరీర్​లోనే ల్యాండ్​మార్క్​ చిత్రమయ్యేలా ప్లాన్ చేస్తున్నానని అన్నారు.

allu arjun
అల్లుఅర్జున్

బాలీవుడ్​ నుంచి ఇప్పటికే తనకు చాలా ఆఫర్స్ వచ్చాయని, కానీ సరైన కథ కోసం వేచిచూస్తున్నానని ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ అన్నారు. 'పుష్ప' ప్రచారంలో భాగంగా గురువారం ముంబయి వెళ్లి బన్నీ.. హిందీ సినిమాల్లో తన ఎంట్రీ గురించి మరోసారి మాట్లాడారు.

pushpa mumbai press meet
'పుష్ప' ముంబయి ప్రెస్​మీట్

"నాకు హిందీ సినిమాలంటే ఇష్టం. వాటిని చూస్తూనే పెరిగాను. కచ్చితంగా బాలీవుడ్​లో నేరుగా సినిమా చేస్తాను. అది నా కెరీర్​లోనే ల్యాండ్​మార్క్​ ఫిల్మ్ అవుతుంది. అందుకే అది ప్రత్యేకంగా ఉండాలని అనుకుంటున్నాను. ఇప్పటికే కొన్ని ఆఫర్స్ వచ్చినప్పటికీ అవేవి అంత ఆసక్తిగా అనిపించలేదు. అన్ని సరిగ్గా కుదిరితే మాత్రం హిందీలో నా నుంచి భారీ సినిమా వస్తుంది" అని హీరో అల్లు అర్జున్ చెప్పారు.

అల్లుఅర్జున్ హీరోగా నటించిన 'పుష్ప' తొలిభాగం డిసెంబరు 17న పాన్ ఇండియా రేంజ్​లో రిలీజ్ కానుంది. ఇందులో రష్మిక హీరోయిన్. ఫహాద్ ఫాజిల్ కీలకపాత్ర పోషించారు. సునీల్, అనసూయ ప్రతినాయకులుగా నటించారు. సుకుమార్ దర్శకత్వం వహించారు.

అయితే తన నుంచి రాబోయే సినిమాలు అన్నీ పాన్ ఇండియా రేంజ్​లోనే ఉంటాయని అల్లు అర్జున్ స్పష్టం చేశారు. భాష అనేది సినిమాకు అడ్డు కాకుడదని అన్నారు. 2000ల్లో ఉత్తరాది, దక్షిణాది​ అనే బేధం ఉండేదని, కానీ గత దశాబ్ద కాలంలో ఆ గీత చెరిగిపోతూ వచ్చిందని బన్నీ చెప్పారు.

pushpa hindi movie
పుష్ప హిందీ మూవీ పోస్టర్

ఎంతోమంది కొత్త నటీనటులు, సాంకేతిక నిపుణులకు వెలికితీస్తున్న ఓటీటీలను మనం మెచ్చుకుని తీరాలని అల్లు అర్జున్ పేర్కొన్నారు. భారతీయ ఎంటర్​టైన్​మెంట్ ఇండస్ట్రీ.. ప్రపంచంలోనే బిగ్గెస్ట్ ఇండస్ట్రీ అని అన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.