ETV Bharat / sitara

'పుష్ప' సినిమా.. ఈ విషయాలు గమనించారా?

author img

By

Published : Dec 16, 2021, 5:40 PM IST

Pushpa movie release: ''పుష్ప'.. పుష్పరాజ్ తగ్గేదే లే' అంటూ బన్నీ ఫ్యాన్స్​ గోల గోల చేస్తున్నారు. మరోవైపు పాన్ ఇండియా రేంజ్​లో రిలీజ్​ అవుతున్న ఈ సినిమాపై భారీగా అంచనాలున్నాయి. మరి ఇంతలా క్రేజ్​ తెచ్చుకున్న 'పుష్ప' సినిమాలోని కొన్ని విషయాలు తెగ ఆసక్తి రేపుతున్నాయి. ఇంతకీ అవేంటి? వాటి సంగతేంటి?

pushpa movie
పుష్ప మూవీ

Allu arjun pushpa: 'అల వైకుంఠపురములో' లాంటి ఇండస్ట్రీ హిట్​ తర్వాత బన్నీ.. 'రంగస్థలం' లాంటి బ్లాక్​బస్టర్​ తర్వాత సుకుమార్ సినిమా చేస్తున్నారనగానే ప్రేక్షకుల్లో ఎక్కడలేని అంచనాలు. వాటికి ఏ మాత్రం తీసిపోని రేంజ్​లోనే 'పుష్ప' సినిమా తీసినట్లు తెలుస్తోంది! ఇప్పటికే వచ్చిన పోస్టర్లు, పాటలు, ట్రైలర్​ చూస్తే ఇది మీకు సులభంగా అర్థమవుతుంది.

pushpa movie
పుష్ప మూవీ

Pushpa hidden details: అయితే ఈ సినిమాలో చాలానే విశేషాలున్నాయి. 'పుష్ప' ట్రైలర్​లోనూ కొన్ని విషయాలు గమనిస్తే.. సినిమా కథేంటి? ఎవరెవరు ఎలాంటి పాత్రలు చేస్తున్నారు? ఇతరత్రా అంశాలు కూడా మీకు కనిపిస్తాయి. ఒకవేళ మీరు అవి మిస్సయినట్లయితే ఈ స్టోరీ చదివేసి వాటిని తెలుసుకోండి.

*అల్లు అర్జున్.. 'పుష్ప' సినిమాలో లారీ డ్రైవర్​గా కనిపిస్తారు. ఈ విషయం టీజర్, ట్రైలర్​లోని కొన్ని సీన్లు చూస్తే మీకు అర్థమవుతుంది.

Pushpa review: పుష్పరాజ్ డ్రైవర్​గా ఉన్నప్పుడు మెడలో కేవలం తాయత్తు, మాసిన బట్టలు, ఉంగరాల జట్టుతో కనిపించాడు. ఆ తర్వాత డ్రైవర్​ నుంచి అతడి రేంజ్​ మారిందనే విషయాన్ని లాంగ్​ హెయిర్​, మెడల్ గోల్డ్​ చైన్స్, ఖరీదైన దుస్తులు వంటి వాటితో సింబాలిక్​గా చూపించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

*డైరెక్టర్ సుకుమార్.. హీరోను రాముడు మంచి బాలుడు అనే టైపులో అస్సలు చూపించరు! అతడిలోనూ కొన్ని ప్రతినాయక లక్షణాలు ఉంటాయి. తన గత సినిమాల్లోలానే దీనిలోనూ హీరోయిజం, విలనిజం మిక్స్ అయిన కథానాయకుడ్ని అలియాస్ పుష్పరాజ్​ను​ చూపించారు.

*పోలీసులు వస్తున్నారనే విషయాన్ని కొందరు ఈల వేసి అడవిలో ఉన్నవాళ్లకు చెప్పడం.. వాళ్లు ఎర్రచందనం దుంగలను తాళ్లతో కట్టి పైకి లేపడం, పోలీసులు వెళ్లిపోయిన తర్వాత ఆ దుంగలు అన్ని కిందపడటం లాంటి సన్నివేశాలు టీజర్, ట్రైలర్​ మీరు స్పష్టంగా గమనించొచ్చు.

*హీరోయిన్​ వెనక తిరిగేటప్పుడు నార్మల్​గా కనిపించే పుష్ప.. ఆ తర్వాత నుదుటిపై చిన్న దెబ్బతో కనిపిస్తాడు. అడవిలో అతడికి వేరే గ్యాంగ్​కు జరిగే ఫైట్​ సీన్​లో అది తగిలి ఉండొచ్చు అనిపిస్తుంది. అందుకు సంబంధించిన కొన్ని షాట్స్​ మీరు ట్రైలర్​లో గమనించొచ్చు. బైక్​పై నీటిలో విలన్​ బ్యాచ్​ను చితక్కొట్టడం, పూర్తిగా గుడ్డతో ముఖం కప్పేసిన వ్యక్తి(పుష్పరాజ్) చెట్టుకు గుద్దుకొని పడిపోయే సన్నివేశాలు ఈ ఫైట్​లోనివే!

pushpa movie
పుష్ప మూవీ

*'పుష్ప'లో గొడ్డలి, లాంతరును చాలాసార్లు చూపించారు. ఈ సినిమాలో ఎమ్మెల్యే పాత్రధారి రావు రమేశ్​ పార్టీ గుర్తు లాంతరు కావడం, ఇదే పార్టీ తరఫున పుష్పరాజ్ ప్రచారంలో పాల్గొనడం లాంటి సన్నివేశాలు ఆసక్తి రేపుతున్నాయి.

*ఎర్రచందనం స్లగ్మింగ్ చేయాలంటే ఏదో ఓ నౌకాశ్రయం నుంచే విదేశాలకు తరలించాలి. ఈ సినిమాలో అది చెన్నై పోర్ట్​ ద్వారా జరిగినట్లు తెలుస్తోంది. పుష్పరాజ్ లారీ నంబర్ ప్లేట్​ తమిళనాడు రిజిస్ట్రేషన్​తో ఉండటం, చెక్​పోస్ట్​ పోలీసులతో పుష్పరాజ్​ ఛేజింగ్​ లాంటి సన్నివేశాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

*ట్రైలర్ చివర్లో 'పార్టీ లేదా పుష్ప?' అని పోలీస్​ అధికారి భన్వర్ సింగ్ షెకావత్​(ఫహాద్ ఫాజిల్) చెప్పిన డైలాగ్​ ఇప్పుడు సోషల్ మీడియాలో ఊతపదంగా మారి ట్రెండింగ్​ అయిపోయింది. అయితే ఫహాద్ పాత్ర తొలి భాగంలో చాలా తక్కువ నిడివి అని, రెండో భాగంలో అతడి పాత్ర పూర్తిస్థాయిలో కనిపిస్తుందని తెలుస్తోంది.

fahadh faasil pushpa
ఫహాద్ ఫాజిల్

*ఇన్ని విశేషాలతో తెరకెక్కిన 'పుష్ప' ఎలా ఉండబోతుంది? ఏ రేంజ్​లో అలరించబోతుంది అనేది తెలియాలంటే మాత్రం దగ్గరలోని థియేటర్​కు వెళ్లి సినిమా చూసేయండి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.