ETV Bharat / sitara

త్వరలోనే 'ఆర్య 3'.. సుకుమార్​ క్లారిటీ

author img

By

Published : Oct 11, 2021, 9:15 AM IST

sukumar
సుకుమార్​

అల్లు అర్జున్‌-సుకుమార్‌ల(arya sukumar)కలయికలో వచ్చిన 'ఆర్య' సిరీస్‌ చిత్రాలు ఎంతగా హిట్​ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడా సిరీస్​లో భాగంగా 'ఆర్య 3'(Arya 3 movie) తీసుకురానున్నట్లు తెలిపారు దర్శకుడు సుకుమార్​.

అల్లు అర్జున్‌.. సుకుమార్‌ల కలయికలో వచ్చిన 'ఆర్య'(alluarjun arya movie) సిరీస్‌ చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కింది. ఇప్పుడా సిరీస్‌కు కొనసాగింపుగా 'ఆర్య 3'(Arya 3 movie) తీసుకురానున్నట్లు దర్శకుడు సుకుమార్‌ సామాజిక మాధ్యమాల వేదికగా తెలియజేశారు.

తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో ముచ్చటించిన సుకుమార్.. 'పుష్ప'(pushpa movie) సినిమాతో పాటు 'ఆర్య 2' సీక్వెల్‌కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. 'పుష్ప: ది రైజ్‌'(pushpa movie release date) విడుదల తేదీలో ఎలాంటి మార్పు ఉండదని, కచ్చితంగా డిసెంబరు 17న ప్రేక్షకుల ముందుకొస్తుందని తెలియజేశారు. ఈ చిత్రంలో సునీల్‌ ఓ ప్రధాన విరోధిగా కనిపిస్తారని, ఫహద్‌ ఫాజిల్‌ పాత్ర క్లైమాక్స్‌లోనే ప్రవేశిస్తుందని స్పష్టత ఇచ్చారు.

ఈ సందర్భంగా ఓ నెటిజన్‌ 'ఆర్య 3'(Arya 3 movie) ఉంటుందా? అని ప్రశ్నించగా.. కచ్చితంగా ఉంటుందని చెప్పారు. సుకుమార్‌ ప్రస్తుతం అల్లు అర్జున్‌తో 'పుష్ప' తెరకెక్కిస్తున్నారు. 'ఆర్య', 'ఆర్య2' వంటి విజయాల తర్వాత ఈ ఇద్దరి కలయికలో రూపొందుతోన్న హ్యాట్రిక్‌ చిత్రమిది. రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న ఈ సినిమా.. ప్రస్తుతం తొలి భాగం చిత్రీకరణ పూర్తి చేసుకునే పనిలో ఉంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: హీరోయిన్​కు వాటర్ ట్యాప్​ అని పేరు పెట్టిన టాప్ డైరెక్టర్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.