ETV Bharat / sitara

'రక్తం రుచి మరిగిన కిల్లర్​లా మారిన క్వీన్​'

author img

By

Published : Aug 9, 2019, 1:02 PM IST

కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన 'ధాకద్'​ టీజర్​ ఆకట్టుకునేలా ఉంది. పూర్తి స్థాయి యాక్షన్ కథాంశంతో తెరకెక్కుతోందీ చిత్రం.

టీజర్: కంగనా... రక్తం మరిగిన కిల్లర్

బాలీవుడ్​ ఫైర్​బ్రాండ్​ కంగనా రనౌత్... కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రాలు చేస్తూ దూసుకుపోతోంది. ఇటీవలే 'జడ్జిమెంటల్ హై క్యా' చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించింది. అంతకుముందు 'మణికర్ణిక'గా కత్తి పట్టిన ఈ భామ.. ఇప్పుడు 'ధాకద్​'లో పూర్తి స్థాయి యాక్షన్ పాత్రలో కనిపించనుంది. శుక్రవారం విడుదలైన టీజర్​ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

ఇందులో ఎమ్ 4 కార్బైన్​ గన్​తో శత్రువుల గుండెల్లో బుల్లెట్ల వర్షం కురిపించి, ముఖంపై చిందిన రక్తాన్ని నాలుకతో రుచి చూస్తున్న కంగన.. అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించింది. సినిమాపై అంచనాల్ని పెంచేస్తోంది.

ఈ చిత్రం కోసం హాలీవుడ్​ స్టంట్​ మాస్టర్స్​తో సన్నివేశాల్ని చిత్రీకరించేందుకు నిర్మాతలు ప్లాన్​ చేస్తున్నారు. రజనీష్ ఘాయ్ దర్శకత్వం వహిస్తున్నాడు. వచ్చే ఏడాది దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

kanagana look in dhaakad
ధాకద్ సినిమాలోని కంగనా లుక్

ఇది చదవండి: 'పోకిరి'లో కంగనాను ఊహించగలమా!

Kullu (Himachal Pradesh), Aug 09 (ANI): A foreign tourist rescued by local trekkers in Himachal Pradesh's Kullu. He got several injuries and trekkers carried him on their shoulders. The identity of the foreign tourist is still unidentified.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.