ETV Bharat / sitara

సినీ​ ప్రొడక్షన్​ మహిళల​కు అలీ దంపతుల సాయం

author img

By

Published : May 23, 2021, 7:54 PM IST

టాలీవుడ్​లో షూటింగ్​లు లేక ఆర్థిక ఇబ్బందులు పడుతోన్న ఉమెన్ ప్రొడక్షన్​ యూనియన్​కు అండగా నిలిచేందుకు ప్రముఖ నటుడు అలీ ముందుకొచ్చారు. ఆ యూనియన్​లో పనిచేస్తోన్న 130 మంది మహిళలకు తన భార్య జుబేదాతో కలిసి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

Comedian Ali donates essential goods to tollywood women production union
సినీ​ ప్రొడక్షన్​ మహిళల​కు అలీ దంపతుల సాయం

సినిమా చిత్రీకరణలు లేక ఆర్థిక ఇబ్బందులు పడుతోన్న తెలుగు సినిమా ఉమెన్ ప్రొడక్షన్ యూనియన్​కు ప్రముఖ నటుడు అలీ బాసటగా నిలిచారు. అందులో పనిచేస్తున్న 130 మంది మహిళలకు ఆయన సతీమణి జుబేదాతో కలిసి నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. సుమారు 2 లక్షల రూపాయల వ్యయంతో పది కిలోల బియ్యం, నూనె, గోధుమపిండి, చక్కెరతోపాటు 8 రకాల సరుకులను వారికి అందజేశారు.

షూటింగ్​ల్లో ప్రొడక్షన్ మహిళలు ఎంతో సహకరిస్తారని, చిత్రీకరణలో పనిచేసే వారి తిన్న పేట్లను, వస్తువులను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉంటారని అలీ పేర్కొన్నారు. అలాంటి వారికి పని లేకపోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని గ్రహించి తనవంతుగా ఉమెన్ ప్రొడక్షన్ యూనియన్​ నిత్యావసర సరుకులు అందించినట్లు ఆయన తెలిపారు.

ఇదీ చూడండి.. ప్రముఖ నేపథ్య గాయకుడు ఏవీఎన్​ మూర్తి మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.