ETV Bharat / sitara

'ఆచార్య' నుంచి 'సిద్ధ' వచ్చేశాడు

author img

By

Published : Nov 28, 2021, 4:09 PM IST

Updated : Nov 28, 2021, 8:06 PM IST

ఆచార్య సిద్ధ టీజర్​ రిలీజ్​, Acharya siddha teaser released, Acharya movie teaser
ఆచార్య సిద్ధ టీజర్​ రిలీజ్​

Acharya siddha teaser: మెగాస్టార్​ చిరంజీవి, రామ్​చరణ్​ కలిసి నటిస్తున్న చిత్రం 'ఆచార్య'. ఈ సినిమాలో 'సిద్ధ'గా నటిస్తున్న చెర్రీకి సంబంధించిన టీజర్​ విడుదలైంది. ఇందులో చరణ్​ నటన అదిరిపోయింది.

siddha teaser: మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ తెరకెక్కించిన సినిమా 'ఆచార్య'(chiru acharya movie). 'సిద్ధ'గా రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్​ను వేవవంతం చేసింది చిత్రబృందం. ఇందులో భాగంగా సిద్ధ పాత్రకు సంబంధించిన చిత్ర టీజర్​ను రిలీజ్​ చేసింది చిత్రబృందం. ఇందులో చరణ్​ శక్తిమంతమైన పాత్రలో ఒదిగిపోయారు. ఆయన గెటప్‌, నటన అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఈ చిత్రంలో దేవాలయాల బాగు కోసం పాటుపడే పాత్రలో చిరు కనిపించనున్నారు. అలానే నక్సలైట్​ పాత్రలోనూ అభిమానుల్ని అలరించనున్నారు. ఇప్పటికే వచ్చిన టీజర్, పాటలు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ, సినిమాపై అంచనాల్ని పెంచుతున్నాయి. ఇందులో చిరుకు జోడీగా కాజల్(kajal aggarwal in acharya)​, రామ్​చరణ్​కు(ram charan pooja hegde new movie) జోడీగా పూజా హెగ్డే నటించారు. కొణిదెల ప్రొడక్షన్, మ్యాట్నీ ఎంటర్​టైన్​మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదీ చూడండి: 'జై బాలయ్య' పాట.. బాలయ్య స్టెప్పులు అదుర్స్!

Last Updated :Nov 28, 2021, 8:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.