ETV Bharat / sitara

ఆ​ హీరోయిన్​ కోసం బాలీవుడ్ స్టార్ వెయిటింగ్!

author img

By

Published : Sep 28, 2021, 12:23 PM IST

'కబీర్​సింగ్​' చిత్రంతో మరింత క్రేజ్​ తెచ్చుకున్నాడు బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్. ఫ్యాన్స్​తో జరిగిన చిట్​చాట్​లో ఓ టాలీవుడ్​ హీరోయిన్​తో వర్క్​ చేయాలనుందని తన మనసులో మాట బయటపెట్టాడు. అయితే షాహిద్​ను ఫిదా చేసిన ఆ హీరోయిన్ ఎవరో తెలుసా?

shahid kapoor
షాహిద్ కపూర్

'ది ఫ్యామిలీ మ్యాన్​ 2''(The Family Man 2 Web Series) వెబ్​సిరీస్​లో సమంత నటనకు తాను ఫిదా అయ్యానని బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్(Shahid Kapoor Movies) తెలిపాడు. అభిమానులతో ట్విట్టర్​లో షాహిద్​ కపూర్​ చిట్​చాట్​ చేసిన సమయంలో 'ది ఫ్యామిలీ మ్యాన్​ 2' వెబ్​సిరీస్​లో సమంత నటన ఎలా ఉంది?' అని ఓ అభిమాని అడగ్గా.. షాహిద్ దానిపై స్పందించాడు. 'ది ఫ్యామిలీ మ్యాన్​ 2' వెబ్​సిరీస్​లో సమంత నటన అద్భుతంగా ఉందన్నాడు. తనతో కలిసి పనిచేసేందుకు ఇష్టపడతానన్నాడు.

Samantha
నటి సమంత

'ఏమాయ చేశావే చిత్రంతో' తెలుగు తెరకు పరిచయమైన సమంత(Samantha Akkineni Movies).. తర్వాత వరుస సినిమాలతో స్టార్​ హీరోయిన్​గా ఎదిగింది. 'ది ఫ్యామిలీ మ్యాన్​ 2'(The Family Man 2 Web Series) వెబ్​సిరీస్​తో ఓటీటీలోకి అడుగుపెట్టిన తొలిసారే ప్రశంసలు అందుకుంది. ఇందులో తమిళ ఈలం సోల్జర్​ రాజీగా.. ఆమె కనబర్చిన నటనకు సినీప్రియులతో పాటు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి.

సమంత.. ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో 'శాకుతలం'(Samantha Akkineni Movies) చిత్రంలో నటిస్తోంది. నెట్​ఫ్లిక్స్​ రూపొందించనున్న ఓ షోకూ అంగీకారం తెలిపింది. మరోవైపు తమిళంలో 'కాతు వాకుల రెండు కాదల్​' అనే సినిమాలోనూ నటిస్తోంది.

టాలీవుడ్​లో సూపర్​హిట్ చిత్రం​ 'జెర్సీ'(Jersey Release Date) హిందీ రీమేక్​లో షాహిద్​ కపూర్(Shahid Kapoor Movies) నటిస్తున్నారు. అదే పేరుతో హిందీలో రీమేక్​ అవుతోంది ఈ సినిమా. ఇప్పటికే షూటింగ్​ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదీ చదవండి: Ram Charan Movies: 14 ఏళ్ల నట ప్రస్థానం.. వెల్లివిరిసిన అభిమానం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.