ETV Bharat / sitara

'మూడు భాషలు.. మూడు చిత్రాలు.. కలెక్షన్ల సునామీ'

author img

By

Published : Mar 1, 2022, 3:10 PM IST

మూడు సినిమాలు.. మూడు భాషల్లో.. భారీ కలెక్షన్లతో దూసుకుపోతున్నాయి. టాలీవుడ్​ను 'భీమ్లా నాయక్' చిత్రం ఒక ఊపు ఊపుతుంటే.. కోలీవుడ్​లో 'వలిమై' కలెక్షన్ల వర్షం కురుపిస్తోంది. అటు బాలీవుడ్​లోనూ ఆలియా భట్ 'గంగూబాయి' అభిమానుల మనసు దోచుకుంటుంది. ఒకే వారంలో విడుదులైన ఈ మూడు సినిమాలు సత్తా చాటుతున్నాయి.

COLLECTIONS
THREE MOVIES

కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం వల్ల సినిమాల విడుదల ఊపందుకుంది. గత వారంలో మూడు పెద్ద స్టార్ల సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. మూడు భాషల్లో వచ్చిన మూడు సినిమాలు విపరీతమైన కలెక్షన్లతో దూసుకుపోతున్నాయి. భీమ్లానాయక్​, వలిమై సినిమాలు రూ.100 కోట్ల క్లబ్​లోకి చేరగా, గంగూబాయి కతియావాడి చిత్రం కలెక్షన్లు రూ.50 కోట్లకు చేరువలో ఉన్నట్టు సమాచారం.

భీమ్లానాయక్ దెబ్బ.. బాక్సాఫీసు అబ్బా..

పవర్​స్టార్​ పవన్ కల్యాణ్, రానా ప్రధాన పాత్రధారులుగా నటించిన 'భీమ్లానాయక్'​ చిత్రం ఫిబ్రవరి 25న విడుదలైంది. మలయాళ సినిమా రీమేక్​గా తెరకెక్కిన భీమ్లా నాయక్​కు సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహించగా, త్రివిక్రమ్ శ్రీనివాస్​ మాటలు రాసి స్క్రీన్​ప్లే అందించారు. భీమ్లానాయక్​ దెబ్బకు బాక్సాఫీసు దద్దరిల్లిపోతోంది. మొదటి ముడు రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్​ సంపాదించుకున్నట్లు తెలుస్తోంది.

భీమ్లా నాయక్ సినిమా రిలీజ్​కు చాలా సమస్యలు ఎదురయ్యాయి. ఏపీలో సినిమా టికెట్ల రగడ ఇంకా నడుస్తుంది. అయినా సరే.. ధైర్యంగా చిత్ర బృందం రిలీజ్ చేసింది. భీమ్లానాయక్​గా పవన్, డానియల్​గా రానా నటనకు అభిమానులు ఫిదా అయ్యారు

పవన్​ కల్యాణ్​
భీమ్లా నాయక్​
  • " class="align-text-top noRightClick twitterSection" data="">

నటనతో మెప్పించిన 'గంగూబాయి'

భీమ్లానాయక్​ రిలీజైన రోజే బాలీవుడ్​లో గంగూబాయి కతియావాడి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆలియాభట్​ తన కెరీర్​లో మొదటి ప్రయోగత్మకమైన చిత్రం ఇది. లేడీ డాన్​ పాత్రలో ఆలియా అద్భుతంగా నటించి అభిమానులను మెప్పించింది. ఈ చిత్రానికి బాలీవుడ్​ స్టార్​ డైరెక్టర్ సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వం వహించారు. ఎప్పుడో చిత్రీకరణ పూర్తి చేసుకున్నా.. కొన్ని కారణాల వల్ల సినిమా ఆలస్యంగా విడుదలైంది. ఇప్పుడు బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. రూ.50 కోట్ల క్లబ్​కు చేరువలో ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

గంగూబాయి సినిమాను చుట్టుకున్న వివాదాలు బాగా హైప్‌ తీసుకొచ్చాయి. అయితే ఈ సినిమాలో తన తల్లి గంగూబాయి కతియావాడిని వేశ్యగా చూపించారంటూ ఆమె కుమారుడు కోర్టుకు వెళ్లారు. సినిమా విడుదల కూడా ఆపేయాలని ప్రయత్నించగా.. విడుదలపై స్టే విధించేందుకు కోర్టు నిరాకరించింది.

ఆలియా భట్
గంగూబాయి కతియావాడి
  • " class="align-text-top noRightClick twitterSection" data="">

దూసుకుపోతున్న 'వలిమై'

ఫిబ్రవరి 24వ తేదీన తమిళ, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో 'వలిమై' విడుదలైంది. తమిళంలో మంచి క్రేజ్​ ఉన్న హీరో అజిత్​ కథానాయకుడిగా నటించిన చిత్రం వలిమై. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా యువ హీరో కార్తికేయ నటించారు. యాక్షన్​ థ్రిల్లర్​గా తెరకెక్కిన ఈ చిత్రంలో బైక్​ రేసుల నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు హైలైట్​గా నిలిచాయి. ఈ చిత్రానికి హెచ్. వినోద్​ దర్శకత్వం వహించగా, బాలీవుడ్ స్టార్​ బోనీ కపూర్​ నిర్మించారు.

బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. తమిళనాట తొలి రోజే ఈ సినిమా రూ.36 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. వీకెండ్​లో ఈ సినిమా జోరు గట్టిగానే కొనసాగింది. ఒక్క తమిళనాడులోనే ఈ సినిమా రూ.100 కోట్లపైగా వసూళ్లను సాధించిందని అంచనా. తమిళనాట మరికొన్ని రోజులు వలిమై హవా ఇలానే కొనసాగుతోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

అజిత్​
వలిమై
  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చదవండి: శివరాత్రి స్పెషల్​.. 'భోళాశంకర్'​ స్పెషల్​ వీడియో రిలీజ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.