ETV Bharat / sitara

టాలీవుడ్​ దీపావళి.. కొత్త అప్​డేట్స్​తో సందడి

author img

By

Published : Nov 4, 2021, 10:24 AM IST

Updated : Nov 4, 2021, 2:31 PM IST

దీపావళి పురస్కరించుకుని టాలీవుడ్ సినిమాలకు సంబంధించిన వరుస అప్​డేట్స్​ రిలీజ్ అవుతున్నాయి. నాగార్జున 'బంగార్రాజు' చిత్రబృందం అందరికీ పండగ శుభాకాంక్షలు తెలుపుతూ ఓ వీడియో విడుదల చేయగా, పవన్ కల్యాణ్ 'భీమ్లా నాయక్', విజయ్ దేవరకొండ 'లైగర్'​ నుంచి కొత్త పోస్టర్లు విడుదలై అలరిస్తున్నాయి.

Tollywood
టాలీవుడ్

దేశమంతటా దీపావళి పండగ సందడి కనిపిస్తోంది. అలాగే ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని టాలీవుడ్​లోనూ కొత్త పోస్టర్లు కళకళలాడుతున్నాయి. ప్రేక్షకులకు పండగ శుభాకాంక్షలు తెలుపుతూ పలు చిత్రబృందాలు ఫొటోలు, వీడియోలతో సందడి చేస్తున్నాయి. 'బంగార్రాజు' చిత్రబృందం ఓ వీడియో విడుదల చేయగా, పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్, విజయ్ దేవరకొండ లైగర్​ నుంచి కొత్త పోస్టర్లు విడుదలై అలరిస్తున్నాయి. అవేంటో చూసేయండి.

పవన్ కల్యాణ్, రానా ప్రధానపాత్రల్లో సాగర్ చంద్ర తెరకెక్కిస్తున్న చిత్రం 'భీమ్లా నాయక్'. బుధవారం ఈ సినిమా నుంచి 'లాలా భీమ్లా' పాట విడుదల చేయగా ఇప్పటికీ యూట్యూబ్​లో ట్రెండింగ్​లో ఉంది. తాజాగా ఓ కొత్త పోస్టర్​ను విడుదల చేసింది చిత్రబృందం.

Tollywood
భీమ్లా నాయక్

అక్కినేని నాగార్జున, నాగచైతన్య కాంబోలో వస్తోన్న చిత్రం 'బంగార్రాజు'. కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా 'సోగ్గాడే చిన్నినాయనా'కు ప్రీక్వెల్​గా రూపొందుతోంది. తాజాగా ఈ పండగ రోజున ప్రత్యేక వీడియోను విడుదల చేసింది చిత్రబృందం.

రమేశ్‌ వర్మ దర్శకత్వంలో రవితేజ(Ravi teja) కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'ఖిలాడి'(khiladi). మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయాతీ కథానాయికలు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాకు సంబంధించిన ‘ఖిలాడి’ టైటిల్‌ సాంగ్‌ను విడుదల చేశారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూర్చారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

బాక్సింగ్‌ కింగ్‌ మైక్‌ టైసన్‌(Mike Tyson) భారతీయ వెండితెరపై సందడి చేసే సమయం ఆసన్నమైంది. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ(vijay devarakonda) నటిస్తున్న మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ చిత్రం 'లైగర్‌'. దీపావళి సందర్భంగా మైక్‌ టైసన్‌ పిడికిలి బిగించిన పోస్టర్‌ను విడుదల చేశారు.

మారుతి దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా 'పక్కా కమర్షియల్' అనే చిత్రం తెరకెక్కుతోంది. దీపావళి సందర్భంగా దీనికి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవేకాక మరికొన్ని అప్​డేట్స్ మీకోసం..

Tollywood
వరుడు కావలెను
Tollywood
పుష్పక విమానం
Tollywood
డేగల బాబ్జీ
Tollywood
మిషన్ ఇంపాజిబుల్
Tollywood
లక్ష్య
Tollywood
గని
Last Updated : Nov 4, 2021, 2:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.