ETV Bharat / sitara

MAA Elections: 'మా' ఎన్నికల బరి నుంచి తప్పుకొన్న బండ్ల గణేశ్​

author img

By

Published : Oct 1, 2021, 3:05 PM IST

Updated : Oct 1, 2021, 3:33 PM IST

Bandla Ganesh Withdraws His Nomination in MAA Elections
MAA Elections: 'మా' ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బండ్ల గణేశ్​

'మా' ఎన్నికల్లో(MAA Elections) జనరల్​ సెక్రటరీ పదవికి పోటీ నుంచి వైదొలగినట్లు నటుడు, నిర్మాత బండ్ల గణేశ్​(Bandla Ganesh MAA Elections) ప్రకటించారు. తన సన్నిహితులు, ఆత్మీయుల సూచన మేరకు తన నామినేషన్​ను ఉపసంహరించుకున్నట్లు తెలిపారు.

మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్ ఎన్నికలు(MAA Elections) క్రమేపిస్తున్న నేపథ్యంలో టాలీవుడ్​లో పరిస్థితులు రసవత్తరంగా మారాయి. అక్టోబర్ 10న జరగనున్న 'మా' ఎన్నికల్లో అధ్యక్ష పదవి రేసులో ప్రకాశ్​ రాజ్​(Prakash Raj MAA Elections), మంచు విష్ణు(Manchu Vishnu MAA Elections) ప్రధానంగా పోటీ పడనున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరూ జోరుగా 'మా' ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇదిలా ఉండగా.. 'మా' జనరల్​ సెక్రటరీ పదవికి స్వతంత్ర అభ్యర్ధిగా నామినేషన్​ దాఖలు చేసిన నిర్మాత బండ్ల గణేశ్​(Bandla Ganesh MAA Elections) శుక్రవారం కీలక నిర్ణయం ప్రకటించారు. 'మా' ఎన్నికల బరి నుంచి తాను తప్పుకొంటున్నట్లు ట్వీట్​ చేశారు. సన్నిహితుల, ఆత్మీయుల సూచన మేరకు తన నామినేషన్​ను ఉపసంహరించుకున్నట్లు బండ్ల గణేశ్​ వెల్లడించారు.

  • నా దైవ సమానులు నా ఆత్మీయులు నా శ్రేయోభిలాషులు సూచన మేరకు నేను మా జనరల్ సెక్రెటరీ నామినేషన్ ఉపసంహరించుకున్నాను. ⁦@actorsrikanth⁩ ⁦@prakashraaj⁩ 👍 pic.twitter.com/s6zx2MqCFL

    — BANDLA GANESH. (@ganeshbandla) October 1, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"నా దైవ సమానులు, నా ఆత్మీయులు, నా శ్రేయోభిలాషులు సూచన మేరకు నేను మా జనరల్ సెక్రెటరీ నామినేషన్ ఉపసంహరించుకున్నాను" అని బండ్ల గణేశ్​ ట్వీట్​ చేశారు.

'మా' ఎన్నికల్లో(MAA Elections 2021) మొదట ప్రకాశ్​ రాజ్​ ప్యానల్​లో ఉన్న బండ్ల గణేశ్​.. అనుహ్యంగా ఆ ప్యానల్​ నుంచి తప్పుకొని స్వతంత్ర అభ్యర్ధిగా బరిలో దిగారు. జనరల్​ సెక్రటరీగా తనను ఎన్నుకోవాలంటూ సోషల్​ మీడియా వేదికగా బండ్ల గణేశ్ విన్నూత్న ప్రచారం చేశారు. అయితే ప్రస్తుతం ఆ పోటీ నుంచి వైదొలగినట్లు బండ్ల గణేశ్​ ట్విట్టర్​లో వెల్లడించారు. ఈ సందర్భంగా నటులు ప్రకాశ్​ రాజ్​, శ్రీకాంత్​లతో ఉన్న ఫొటోను షేర్​ చేశారు.

ఇదీ చూడండి.. Republic movie review: 'రిపబ్లిక్' మూవీ రివ్యూ

Last Updated :Oct 1, 2021, 3:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.