ETV Bharat / sitara

మహేశ్ సినిమా చేసినందుకు తిట్టారు: బండ్ల గణేశ్​

author img

By

Published : Jul 8, 2020, 11:58 AM IST

'సరిలేరు నీకెవ్వరు'లో నటించినందుకు ఆప్తులు తనను తిట్టినట్లు వెల్లడించారు బండ్ల గణేశ్. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయాల్ని పంచుకున్నారు.

BANDLA GANESH
బండ్ల గణేశ్​

సినీ పరిశ్రమలో నటుడిగా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు బండ్ల గణేశ్​. రాజకీయాల్లోనూ హాట్​టాపిక్​గా నిలుస్తుంటారు. ఇటీవలే ఆయనకు కరోనా పాజిటివ్​గా తేలడం ఇండస్ట్రీలో కలకలం రేపింది. ఈ మహమ్మారితో పోరాడి, వారంలోనే కోలుకున్నారు గణేశ్​. అయితే ఇటీవలే ఓ యూట్యూబ్​ ఛానెల్​కు ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రోమోలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

సూపర్​స్టార్​ మహేశ్​బాబు 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో తాను చేసిన గణేశ్​ పాత్ర గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోల్ తనకు సంతృప్తినివ్వలేదని అన్నారు. ఆప్తులంతా ఎందుకు చేశావని తిట్టినట్లు వెల్లడించారు. దీంతో నటనకు వీడ్కోలు పలికే ఆలోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు.

చాలా విరామం తర్వాత 'సరిలేరు నీకెవ్వరు'తో నటుడిగా రీఎంట్రీ ఇచ్చారు బండ్ల గణేశ్​. సినిమా ప్రేక్షకాదరణ పొందినా, గణేశ్​ పాత్ర అభిమానుల్ని ఆకట్టుకోవడంలో విఫలమయిన కారణంగా పై వ్యాఖ్యలు చేశారీ నటుడు.

ఇదీ చూడండి:కొత్త సినిమా ఫస్ట్​లుక్​పై స్పష్టతనిచ్చిన ప్రభాస్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.