ETV Bharat / sitara

Balakrishna: ఆ పండగ కానుకగా 'అఖండ'

author img

By

Published : Jun 21, 2021, 7:36 AM IST

Akhanda
అఖండ

కరోనా తగ్గుముఖం పట్టడం వల్ల బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ(Balakrishna) హీరోగా తెరకెక్కుతున్న 'అఖండ' సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మిగిలి ఉన్న షూటింగ్​ను త్వరగా పూర్తి చేసి వినాయక చతుర్థి కానుకగా, సెప్టెంబర్‌ 10న థియేటర్లలో రిలీజ్​ చేయాలని ప్రణాళిక రచిస్తున్నట్లు తెలిసింది.

కరోనా ఉద్ధృతి తగ్గడం వల్ల చిత్రాలు మళ్లీ పట్టాలెక్కుతున్నాయి. బాలకృష్ణ-బోయపాటి(Balakrishna-Boyapati) హిట్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'అఖండ'(Akhanda) చిత్రీకరణ పూర్తి చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే మెజారిటీ భాగం షూటింగ్‌ పూర్తయింది. తొలుత మే 28న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కరోనా కేసులు పెరగడం వల్ల చిత్రీకరణ తుదిదశలో ఉన్నప్పుడు తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది.

ప్రస్తుతం పరిస్థితులు సద్దుమణుగుతున్న తరుణంలో ఈ చిత్రం త్వరలో మళ్లీ పట్టాలెక్కనుంది. భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా విడుదల విషయంలో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకూడదని చిత్రబృందం భావిస్తోంది. ఈ వినాయక చతుర్థి కానుకగా, సెప్టెంబర్‌ 10న థియేటర్లలో విడుదల చేసేలా సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. త్వరలోనే అధికార ప్రకటన వచ్చే అవకాశముంగది. మిర్యాల రవీందర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రగ్యాజైస్వాల్‌ హీరోయిన్‌. ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయంతో అలరించనున్నారు. శ్రీకాంత్‌, పూర్ణ కీలకపాత్ర పోషిస్తున్నారు. తమన్‌ సంగీతం అందించారు.

ఇదీ చూడండి: Balakrishna: 'అఖండ'.. జులై నుంచి హైదరాబాద్​లో!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.