ETV Bharat / sitara

ప్రదీప్ రెండో సినిమా.. జనవరిలో ప్రకటన

author img

By

Published : Dec 20, 2020, 6:52 PM IST

తన రెండో సినిమా గురించి త్వరలో ప్రకటన చేయనున్నట్లు ప్రదీప్​ తెలిపారు. మొదటి చిత్రాన్ని మరికొన్ని రోజుల్లో థియేటర్లలోకి తీసుకొస్తామని అన్నారు.

anchor-actor-pradeep-machiraju-about-his-next-movie
ప్రదీప్ రెండో సినిమా.. జనవరిలో ప్రకటన

ప్రముఖ వ్యాఖ్యాత, నటుడు ప్రదీప్.. మరో సినిమాకు సిద్ధమయ్యారు. రానున్న జనవరిలో ఆ కబురు చెబుతానని అన్నారు.

రెండో సినిమా గురించి చెప్పిన ప్రదీప్

'30 రోజుల్లో ప్రేమించడం ఎలా?' సినిమాతో హీరోగా ప్రదీప్ పరిచయం కావాలి. సరిగ్గా విడుదల తేదీన లాక్​డౌన్​ ప్రకటించడం వల్ల అలానే వాయిదా పడింది. అయితే చిత్ర నిర్మాత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని త్వరలోనే తన తొలి సినిమాను థియేటర్​లో విడుదల చేస్తామని ప్రదీప్ చెప్పారు.

ఈ లాక్​డౌన్​లో చిత్ర పరిశ్రమలోని సన్నిహితుల నుంచి కొత్త కథలు విన్నానని ప్రదీప్ పేర్కొన్నారు. త్వరలో రెండో సినిమాపై ప్రకటన చేస్తానని అన్నారు. ప్రేక్షకులు అన్ని జాగ్రత్తలు తీసుకుని థియేటర్లలో సినిమాను ఆస్వాదించాలని కోరారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.