ETV Bharat / sitara

ఇన్​స్టాగ్రామ్​లో ఐకాన్​ స్టార్​ భార్య స్నేహా రెడ్డి రికార్డ్!

author img

By

Published : Nov 19, 2021, 4:26 PM IST

followers of allu sneha reddy in instagram
అల్లు స్నేహా రెడ్డి ఇన్​స్టాగ్రామ్ ఫాలోవర్లు

ఐకాన్ స్టార్​ అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహా రెడ్డి(Allu arjun wife) ఇన్​స్టాగ్రామ్​లో 60 లక్షల మంది ఫాలోవర్లను సంపాదించుకున్నారు. ఇతర నటుల భార్యలకు లేనంత మంది ఫాలోవర్లు స్నేహకు తక్కువ రోజుల్లోనే రావడం గమనార్హం.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్​ భార్య అల్లు స్నేహా రెడ్డి(Allu arjun wife) ఓ అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు. ఇన్​స్టాగ్రామ్​లో 60 లక్షల మంది ఫాలోవర్లను ఆమె సంపాదించుకున్నారు. ఇన్​స్టాలోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ రోజుల్లోనే... ఇంతటి సంఖ్యలో ఫాలోవర్లను ఆమె సంపాదించుకోవడం విశేషం. ఇతర నటుల భార్యల కంటే.. ఎక్కువ మంది ఫాలోవర్లు స్నేహకు ఉన్నారు.

followers of allu sneha reddy in instagram
ఇన్​స్టాలో అల్లు స్నేహారెడ్డి ఫాలోవర్లు

స్నేహా రెడ్డి(Allu arjun wife) తన ఇన్​స్టాగ్రామ్​ ఖాతాలో తమ పిల్లలు అయాన్​, అర్హ ఫొటోలతో పాటు తన భర్త అల్లు అర్జున్ ఫొటోలను షేర్ చేస్తూ ఉంటారు. మీడియాకు దూరంగా ఉన్నా.. కుటుంబంలోని (Allu Arjun Family) సంతోషాలను ఎప్పటికప్పుడు ఫ్యాన్స్​తో సామాజిక మాధ్యమాల ద్వారా షేర్ చేసుకుంటూ ఉంటారు. ఇటీవల దీపావళి వేడుకలు, హలోవీన్ వేడుకలకు సంబంధించిన ఫొటోలను ఆమె షేర్​ చేశారు.

ఇవీ చూడండి:

బన్నీ-స్నేహ రొమాంటిక్ వీడియో.. ఫ్యాన్స్​ ఫిదా!

మోడరన్​ లుక్​లో స్టైలిష్​స్టార్ సతీమణి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.