ETV Bharat / sitara

Pushpa First Review: 'పుష్ప.. ఈ ఏడాది బెస్ట్​ టాలీవుడ్ ఫిల్మ్​'

author img

By

Published : Dec 16, 2021, 10:31 AM IST

Pushpa First Review: సుకుమార్​ దర్శకత్వంలో అల్లుఅర్జున్​ హీరోగా తెరకెక్కిన 'పుష్ప' చిత్రం అద్భుతంగా ఉందని కొనియాడారు సినీవిశ్లేషకుడు ఉమైర్​ సంధు. ఈ ఏడాది ఉత్తమ టాలీవుడ్​ చిత్రంగా 'పుష్ప' నిలుస్తుందని జోస్యం చెప్పారు.

పుష్ప ఫస్ట్​ రివ్యూ
పుష్ప ఫస్ట్​ రివ్యూ

అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో 'పుష్ప' ఒకటి. డిసెంబరు 17న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. తాజాగా.. ఈ చిత్రాన్ని వీక్షించిన యూఏఈ సెన్సార్​ బోర్డు సభ్యుడు ఉమైర్​ సంధు ఫస్ట్​ రివ్యూ ఇచ్చారు. సినిమా అద్భుతంగా ఉందని కొనియాడారు.

ఈ ఏడాదిలో ఉత్తమ టాలీవుడ్​ చిత్రంగా నిలుస్తుందని సంధు అభిప్రాయపడ్డారు. బన్నీ నటన అదిరిపోయిందని కితాబిచ్చారు. హీరోయిన్​ రష్మిక కూడా బాగా నటించిందని, హీరోహీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ సూపర్​గా ఉందని అన్నారు. కథ, స్క్రీన్​ ప్లే, డైలాగ్స్​, సుకుమార్​ దర్శకత్వం అద్భుతంగా ఉందని ప్రశంసించారు.

పుష్ప ఫస్ట్​ రివ్యూ, pushpa first review
పుష్ప ఫస్ట్​ రివ్యూ
పుష్ప ఫస్ట్​ రివ్యూ, pushpa first review
పుష్ప ఫస్ట్​ రివ్యూ
పుష్ప ఫస్ట్​ రివ్యూ, pushpa first review
పుష్ప ఫస్ట్​ రివ్యూ

పక్కా మాస్ మసాలా ఎంటర్​టైనర్​గా 'పుష్ప'ను తెరకెక్కించారు. ఇందులో బన్నీ సరసన రష్మిక హీరోయిన్​గా చేసింది. ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ, ధనంజయ తదితరులు కీలకపాత్రలు పోషించారు. శేషాచలం ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్య కథతో ఈ సినిమా తీశారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు, పోస్టర్లు చిత్రంపై అంచనాల్ని తెగ పెంచేస్తున్నాయి. సినిమా కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో సమంత ప్రత్యేక గీతంతో సందడి చేసింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">
  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: 'పుష్ప' కోసం మూడేళ్లు అడవుల్లోనే!

ఇదీ చూడండి: బాలీవుడ్​ కాదు.. నా టార్గెట్​ అదే: అల్లు అర్జున్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.