ETV Bharat / sitara

'పూరీ తీసిన ఆ సూపర్ హిట్ సినిమాలో హీరో నేనే అన్నారు.. కానీ...'

author img

By

Published : Feb 16, 2022, 9:14 AM IST

Ali tho saradaga actor sriram
ఆలీతో సరదాగా నటుడు శ్రీరామ్​

Alitho saradaga actor Sriram: దర్శకుడు పూరీజగన్నాథ్​ తెరకెక్కించిన ఓ సూపర్​ హిట్​ చిత్రంలో హీరోగా తనను ప్రకటించిన తర్వాత తప్పుకోవాల్సి వచ్చిందని గుర్తుచేసుకున్నారు సినీనటుడు శ్రీరామ్​. ఒకరి తప్పిదం వల్ల గతంలో తాను ఓ అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నట్లు ఆయన తెలిపారు.

Alitho saradaga actor Sriram: 'స్నేహితుడు', 'ఆడవారి మాటలకు అర్థాలు వేరులే' తదితర సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రీరామ్‌ అలియాస్‌ శ్రీకాంత్‌​.. ఈటీవీలో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా కార్యక్రమానికి హాజరై పలు ఆసక్తికర విషయాలను తెలిపారు. ఇందులో భాగంగా దర్శకుడు పూరీజగన్నాథ్​ తెరకెక్కించిన ఓ సూపర్​హిట్ చిత్రంలో హీరోగా తాను నటించాల్సిందని, కానీ తనకు జరిగిన ఓ ప్రమాదం వల్ల అది మిస్​ అయిందని గుర్తుచేసుకున్నారు.

"కేఎల్​ ఎన్​ రాజుతో 'అమ్మనాన్న తమిళ అమ్మాయి' సినిమా చేయాలి. కోనా వెంకట్​ రచయిత. పూరీ జగన్నాథ్​ దర్శకుడు. ప్రెస్​మీట్ పెట్టి నన్ను హీరోగా ప్రకటించారు. కానీ నాకు జరిగిన ఫైర్​ యాక్సిడెంట్​ వల్ల స్టంట్స్​ చేసే పరిస్థితుల్లో నేను లేను. అప్పటికే కాలిపోయిన శరీరంపై కొత్త చర్మం అంటించారు. కోలుకోవడానికి ఆరు నెలలు పడుతుంది. కానీ పూరీ గొప్ప వ్యక్తి. ఫైట్స్​ తగ్గిస్తాను మూవీ చేద్దాం అన్నారు. అలా ఆయన చెప్పడం నాకు సంతోషమేసింది. కానీ.. 'నేను చేయను, ఎందుకంటే అలా చేస్తే సినిమాకు ప్రాణం పోతుంది' అని అన్నాను. ఓ స్టూడియోకు వేళ్తే అక్కడ రవితేజ ఉన్నారు. 'ఎందుకు మంచి సినిమాను వదులుకుంటున్నావు' అని అన్నారు. లేదు ఇప్పుడున్న పరిస్థితిలో నేను చేయలేనను మళ్లీ చెప్పాను. కానీ దాన్ని వదులుకున్నందుకు ఇప్పటికీ ఏదోలా ఉంటుంది. ఆ తర్వాత పూరీతో సినిమా చేద్దామనుకున్నాను. ఆయన తెరకెక్కించిన 'ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం' అంటే ఇష్టం. అది చేయాలనిపించింది. కానీ కుదరలేదు."

-శ్రీరామ్​, నటుడు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఫైర్​ యాక్సిడెంట్​ అలా జరిగింది..

"ఓ సాంగ్​ సీక్వెన్స్​లో భాగంగా చుట్టూ నిప్పు ఉంటుంది. 30 అడుగుల ఎత్తులో ఉన్న ఓ డ్యామ్​ పంప్​ హౌస్​లో నిలబడి ఉన్నాను. చుట్టూ మూడు పక్కల నీళ్లు ఉంటాయి. జీరో డిగ్రీ వాతావరణం ఉంటుంది. బాగా చలి ఉన్న ప్రాంతం. లాస్ట్ షాట్​ తీస్తున్నారు. అది అయిపోతే చెన్నైలోని ఓ బెస్ట్ ఫేస్​​ అవార్డు కోసం వెళ్లాలి. ఇంకో షాట్​ చేద్దాం అన్నారు. సరే అన్నాను. కానీ ఆర్ట్​ అసిస్టెంట్​ రబ్బర్​ సొల్యుషన్ ఎక్కువ పోసేశారు. అప్పుడే గాలీ ఎక్కువ రావడం వల్ల మంటలు ఎగిసిపడ్డాయి. గట్టిగా అరిచాను. దూకితే నీళ్లలో పడిపోతాను. మరోవైపు దూకాలంటే ఇంకో ప్రమాదం పొంచి ఉంది. కాపాడడానికి ఎవరూ రావట్లేదు. ఆ తర్వాత ఓ ఆర్ట్​ అసిస్టెంట్​ వచ్చి నిచ్చెన వేసుకుని పైకి వచ్చి నన్ను కాపాడారు. అప్పటికే నా చర్మం, బట్టలు కాలిపోయాయి. చెవులు, పెదాలు ఏవీ లేవు. ఇక నా జీవితం అయిపోయింది అనుకున్నాను. ఇకా నా కుటుంబం కోసం ఏమీ చేయలేనని అనిపించింది."

-శ్రీరామ్​, నటుడు

శ్రీరామ్‌ ఓ తమిళ సీరియల్‌తో నటుడిగా కెరీర్‌ ప్రారంభించారు. 'రోజాకూటం' అనే తమిళ సినిమాతో హీరోగా మారారు. ఈ సినిమా తెలుగులో 'రోజాపూలు' పేరుతో విడుదలై మంచి విజయం అందుకుంది. ఆయనకు మంచి పేరు తీసుకొచ్చింది. తర్వాత, 'ఒకరికొకరు', 'ఆడవారి మాటలకు అర్థాలు వేరులే' తదితర చిత్రాలతో విశేషంగా ఆకట్టుకున్నారు. ఇటీవల 'టెన్త్‌ క్లాస్‌ డైరీస్‌' అనే సినిమాలో నటించారు.

ఇదీ చూడండి: మ్యూజిక్​ డైరెక్టర్​ బప్పి లహిరి కన్నుమూత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.