ETV Bharat / sitara

'బుట్టబొమ్మ' పాట.. యూట్యూబ్​లో మరో రికార్డు

author img

By

Published : May 23, 2021, 9:33 AM IST

'అల వైకుంఠపురములో' చిత్రంలోని 'బుట్టబొమ్మ' సాంగ్ యూట్యూబ్​ రికార్డులను కొల్లగొడుతోంది. ఈ ప్లాట్​ఫామ్​లో నాలుగు మిలియన్ల(40 లక్షలు) పైగా లైక్స్​ సాధించిన తొలి తెలుగు పాటగా ఘనత వహించింది.

butta bomma
బుట్టబొమ్మ

దేశం, భాషతో సంబంధం లేకుండా అందరినీ అలరిస్తున్న పాట 'బుట్టబొమ్మ'. ఐకాన్​స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటించిన 'అల వైకుంఠపురములో' చిత్రంలోని ఈ గీతం ఇప్పటికే ఎన్నో రికార్డులను సొంతం చేసుకుంది. ఇప్పుడు మరో అరుదైన ఘనత అందుకుంది. యూట్యూబ్​లో నాలుగు మిలియన్ల(40లక్షల) లైక్స్​ సాధించిన తొలి తెలుగు పాటగా రికార్డు నెలకొల్పింది. అంతకుముందు 601 మిలియన్ల(60 కోట్ల) వీక్షణలు సాధించిన తొలి తెలుగు పాటగానూ నిలిచింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

బన్నీ, పూజ జంటగా నటించిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు. తమన్ తన పాటలతో సినిమాపై అంచనాల్ని రెట్టింపు చేశారు. మూవీ విడుదలకు ముందే ఈ చిత్రానికి హిట్ టాక్ వచ్చిందంటే అందుకు కారణం ఈ సినిమా పాటలే. తమన్ సంగీతానికి అర్మాన్ మాలిక్ గాత్రం, అల్లు అర్జున్ స్టెప్పులు 'బుట్టబొమ్మ'కు ప్రాణం పోశాయి. ఈ పాటతో పాటు 'రాములో రాములో' కూడా యూట్యూబ్​లో రికార్డు వ్యూస్​తో కొనసాగుతోంది.

ఇదీ చూడండి: యూట్యూబ్​లో కోట్ల వ్యూస్​తో దూసుకెళ్తున్న తెలుగు పాటలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.