ETV Bharat / sitara

అక్షయ్ కుమార్ 'లక్ష్మీ బాంబ్​' టైటిల్​​ మార్పు

author img

By

Published : Oct 29, 2020, 5:49 PM IST

అక్షయ్ కుమార్ కొత్త సినిమా టైటిల్​లో మార్పు చేస్తూ చిత్రబృందం నిర్ణయం తీసుకుంది. 'లక్ష్మి' పేరుతోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Akshay Kumar's Laxmmi Bomb title changed to Laxmii
'లక్ష్మీ బాంబ్​' టైటిల్​లో మార్పు చేసిన చిత్రబృందం!

బాలీవుడ్ స్టార్​ హీరో అక్షయ్ కుమార్ నటించిన హారర్ కామెడీ సినిమా 'లక్ష్మీబాంబ్'. కరోనా వల్ల వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రాన్ని.. దీపావళి కానుకగా నవంబరు 9న విడుదల చేయనున్న ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్​ హాట్​స్టార్​ ఇటీవలే ప్రకటించింది. అయితే ఈ టైటిల్​ విషయంలో వివాదం జరగడం వల్ల టైటిల్​ను మార్చి 'లక్ష్మి' అని పెట్టారు.

దక్షిణాది సూపర్‌ హిట్‌ 'కాంచన'కు హిందీ రీమేక్ ఈ చిత్రం‌. రాఘవ లారెన్స్​ దర్శకత్వం వహించారు. అక్షయ్​ సరసన కియారా అడ్వాణీ హీరోయిన్​గా నటించింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.