ETV Bharat / sitara

'అఖండ​' 100 డేస్ ఫంక్షన్​.. 'ఆర్​ఆర్​ఆర్​' ఐమ్యాక్స్ వెర్షన్​

author img

By

Published : Mar 9, 2022, 7:53 PM IST

Akhanda 100 Days: సినిమా అప్డేట్స్​ వచ్చేశాయి. ఇందులో నటసింహం బాలకృష్ణ 'అఖండ', 'ఆర్​ఆర్​ఆర్​', చైతూ 'దూత' చిత్రాలకు చెందిన అప్డేట్స్ ఉన్నాయి.

akhanda 100 days RRR imax release version
అఖండ​' 100 డేస్ ఫంక్షన్

Akhanda 100 Days: బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన 'అఖండ' ఘనవిజయం సాధించింది. ఈ చిత్రం రిలీజై (మార్చి 12) శనివారంతో 100రోజులు పూర్తిచేసుకోనుంది. ఈ అఖండ విజయాన్ని పురస్కరించుకుని మార్చి 12న కర్నూలులో కృతజ్ఞత సభను నిర్వహించనుంది చిత్రబృందం. ఇక బాలయ్య కెరీర్​లో కలెక్షన్ల పరంగా అతి పెద్ద సినిమాగా అవతరించింది 'అఖండ'. బాలయ్య నటనకు, యాక్షన్​కు అభిమానులు ఫిదా అయిపోయారు. వారి ఈలలు, గోలలతో థియేటర్లు దద్దరిల్లాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్​లోనూ ఈ చిత్రం ఘన విజయాన్ని అందుకుంది. అక్కడి ప్రేక్షకులు కూడా అఖండకు బ్రహ్మరథం పట్టారు.

akhanda
అఖండ్ 100 డేస్ పోస్టర్​

ఓటీటీలోనూ రికార్డు వ్యూస్..

Akhanda OTT Record: జనవరి 21న 'అఖండ' ఓటీటీలో విడుదలైంది. ఓటీటీలోకి వచ్చి 24గంటల్లోనే 1మిలియన్ స్ట్రీమింగ్స్ సాధించి అరుదైన రికార్డును నెలకొల్పింది. ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించగా, తమన్ సంగీతం అందించారు. ప్రగ్యాజైశ్వాల్‌ కథానాయిక. శ్రీకాంత్​, జగపతిబాబు, పూర్ణ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

బాలయ్య ప్రస్తుతం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్నారు. శ్రుతిహాసన్ కథానాయిక. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మరోవైపు 'అన్​స్టాపబుల్ విత్​ ఎన్​బీకే' టాక్​ షోతో ఓటీటీ ప్రేక్షకుల్ని కూడా అలరిస్తున్నారు బాలకృష్ణ.

ఐమ్యాక్స్​లో ఆర్​ఆర్​ఆర్​

RRR Imax Version: 'ఆర్​ఆర్​ఆర్​' లాంటి సినిమా చిన్న థియేటర్లలో చూస్తే కిక్కు ఏముంటుంది చెప్పండి. అందుకే ఈ సినిమాను ఎంచక్కా ఐమాక్స్​లో చూసి ఎంజాయ్​ చేయమని అంటోంది 'ఆర్​ఆర్​ఆర్​' టీం. ఈ మేరకు ఓ పోస్టర్​ను కూడా రిలీజ్​ చేసింది. ప్రపంచవ్యాప్తంగా మార్చి 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఓవర్సీస్​లో ప్రీమియర్స్​కు రికార్డు స్థాయిలో టికెట్లు అమ్ముడయ్యాయి.

rrr
.

అమెరికాలో అడ్వాన్స్​ బుకింగ్స్​ ఓపెన్​ చేసిన 10 గంటల్లోనే దాదాపు 5 లక్షల డాలర్లను సంపాదించింది. తెలుగు ​రాష్ట్రాల్లోనూ ప్రీమియర్​ షోలు ప్రదర్శించాలని సన్నాహాలు చేస్తున్నారు. జనవరి 7నే విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడినప్పటికీ.. క్రేజ్​ మాత్రం ఏమాత్రం తగ్గలేదనేందుకు ఓవర్​సీస్​లో అడ్వాన్స్​ బుకింగ్సే నిదర్శనం.

కాగా, లండన్​లో ఒడియన్​ బీఎఫ్​ఐ ఐమాక్స్​లోనూ 'ఆర్​ఆర్​ఆర్​' ప్రదర్శనకానుంది. యూకేలోనే ఇది అతి పెద్ద ఐమ్యాక్స్​ థియేటర్​ అవ్వడం విశేషం. కాగా, ఈ తెరపై ప్రదర్శనకానున్న తొలి భారతీయ చిత్రం కూడా ఇదే. యూకేలో దాదాపు 1000 స్క్రీన్లపై 'ఆర్​​ఆర్​ఆర్​'​ రిలీజ్​ కానున్నట్లు తెలిసింది.

ఇక ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మార్చి 25న విడుదల కానుంది. దాదాపు రూ.450కోట్ల భారీ బడ్జెట్​తో నిర్మించిన ఈ మూవీలో రామ్​చరణ్​, ఎన్టీఆర్​ ప్రధాన పాత్రలు పోషించారు. అజయ్​ దేవగణ్​, ఆలియా భట్​, శ్రియ కీలక పాత్రలో నటించారు.

హత్య చిత్రంలో విజయ్​..

విలక్షన నటుడు విజయ్​ ఆంథోనీ మరోసారి థ్రిల్లింగ్ కథ చేస్తున్నారు. ఈ సినిమాకు 'హత్య' అనే టైటిల్​ను ఖరారు చేశారు. దీనికి సంబంధించిన పోస్టర్​ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ చిత్రానికి డైరెక్టర్ బాలాజీ కుమార్ దర్శకత్వం వహించనున్నారు.

hatya
.

ఇదీ చూడండి: ఒక్క ఫైట్ కూడా లేని 'రాధేశ్యామ్'.. అందరినీ అలరిస్తుందా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.