ETV Bharat / sitara

రకుల్ కన్నీటి పర్యంతం- కారణం?

author img

By

Published : Aug 26, 2021, 6:51 PM IST

స్టార్​ హీరోయిన్​ రకుల్​ ప్రీత్​ సింగ్​ (Rakul preet singh) కన్నీటి పర్యంతం అయింది. ఇందుకు సంబంధించిన పోస్ట్​ను ఆమె ఇన్​స్టాలో షేర్​ చేసింది. అసలు ఏమైందంటే...

rakul preet singh
కన్నీటి పర్యంతమైన రకుల్‌ప్రీత్‌ సింగ్‌

దక్షిణాదిలోనే కాకుండా బాలీవుడ్‌లోనూ వరుస సినిమాలు చేస్తూ స్టార్‌ హీరోయిన్‌గా కొనసాగుతోంది నటి రకుల్‌ప్రీత్‌ సింగ్‌. తాజాగా ఈ బ్యూటీ బిజీ లైఫ్‌ నుంచి చిన్న విరామం తీసుకుని.. కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి థియేటర్‌లో సినిమా చూసింది. అక్షయ్‌కుమార్‌ కథానాయకుడిగా నటించిన 'బెల్‌బాటమ్‌' వీక్షించిన రకుల్‌ (Rakul preet singh) కన్నీరు పెట్టుకుంది. ఈ విషయాన్ని ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్‌ చేసింది.

చాలా నెలల తర్వాత థియేటర్‌లో సినిమా చూడటం ఆనందంగా ఉందని.. స్క్రీన్‌పై టైటిల్స్‌ ప్రారంభంకాగానే భావోద్వేగానికి గురయ్యానని.. ఆనందంతో కన్నీరు పెట్టుకున్నానని ఆమె తెలిపింది. అంతేకాకుండా ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ థియేటర్‌లో సినిమా విడుదల చేసిన అక్షయ్‌ కుమార్‌తోపాటు 'బెల్‌బాటమ్‌' చిత్రబృందం మొత్తాన్ని ఆమె అభినందించింది.

ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం రకుల్‌ప్రీత్‌ సింగ్‌ చేతిలో ఆరడజనకు పైగా ప్రాజెక్ట్‌లున్నాయి. తెలుగులో 'కొండపొలం', తమిళంలో 'భారతీయుడు-2', 'అక్టోబర్‌ 31 లేడీస్‌ నైట్‌', 'అయలాన్‌'తోపాటు బాలీవుడ్‌లో 'ఎటాక్‌', 'మేడే', 'థ్యాంక్‌ గాడ్‌', 'డాక్టర్‌ జీ' వంటి సినిమాల్లో ఆమె నటిస్తోంది.

ఇదీ చదవండి : 'సైమా' వేడుక తేదీల్లో మార్పు.. ఆసక్తికరంగా 'నెట్​' ట్రైలర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.