ETV Bharat / sitara

'ఆచార్య'​ నుంచి 'సిద్ధ' టీజర్ రిలీజ్​కు టైమ్​ ఫిక్స్​

author img

By

Published : Nov 27, 2021, 6:08 PM IST

సిద్ధ టీజర్​ రిలీజ్​కు టైమ్​ ఫిక్స్​, acharya siddha teaser release time fix
సిద్ధ టీజర్​ రిలీజ్​కు టైమ్​ ఫిక్స్​

Acharya movie teaser: మెగాస్టార్​ చిరంజీవి, రామ్​చరణ్​ కలిసి నటిస్తున్న చిత్రం 'ఆచార్య'. ఈ సినిమాలో 'సిద్ధ'గా నటిస్తున్న చెర్రీకి సంబంధించిన టీజర్​ను నవంబర్ 28న సాయంత్రం 4.05గంటలకు రిలీజ్​ చేయనున్నట్లు తెలిపింది చిత్రబృందం. దీంతోపాటే ఓ మేకింగ్​ వీడియోను రిలీజ్​ చేసింది.

Acharya movie teaser: మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ తెరకెక్కించిన సినిమా 'ఆచార్య'(chiru acharya movie). 'సిద్ధ'గా రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్​ను వేవవంతం చేసింది చిత్రబృందం. ఇందులో భాగంగా నవంబర్ 28న సాయంత్రం 4.05గంటలకు రామ్​​చరణ్ పాత్రకు సంబంధించిన చిత్ర టీజర్​ను రిలీజ్​ చేయనున్నట్లు తెలిపింది. దీంతోపాటే ఓ మేకింగ్ ​వీడియోను విడుదల చేసింది.

ఈ చిత్రంలో దేవాలయాల బాగు కోసం పాటుపడే పాత్రలో చిరు కనిపించనున్నారు. అలానే నక్సలైట్​ పాత్రలోనూ అభిమానుల్ని అలరించనున్నారు. ఇప్పటికే వచ్చిన టీజర్, పాటలు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ, సినిమాపై అంచనాల్ని పెంచుతున్నాయి. ఇందులో చిరుకు జోడీగా కాజల్(kajal aggarwal in acharya)​, రామ్​చరణ్​కు(ram charan pooja hegde new movie) జోడీగా పూజా హెగ్డే నటించారు. కొణిదెల ప్రొడక్షన్, మ్యాట్నీ ఎంటర్​టైన్​మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.


ఇదీ చూడండి: పవన్-క్రిష్ మూవీ షూటింగ్ మరింత ఆలస్యం.. కారణమిదే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.