ETV Bharat / sitara

'నోటా' దర్శకుడితో విశాల్​ భారీ బడ్జెట్​ చిత్రం!

author img

By

Published : Apr 22, 2020, 5:32 AM IST

తమిళ నటుడు విశాల్​ హీరోగా భారీ బడ్జెట్​ చిత్రం తెరకెక్కబోతోంది. ఈ సినిమాకు ఆనంద్​ శంకర్​ దర్శకత్వం వహిస్తాడని ప్రచారం జరుగుతోంది. లాక్​డౌన్​ తర్వాత మూవీ సెట్స్​పైకి వెళ్తుందని సమాచారం.

A huge budget movie will be on floor for Hero Vishal!
'నోటా' దర్శకుడితో విశాల్​ భారీ బడ్జెట్​ చిత్రం!

హీరో విశాల్‌ తమిళ దర్శకుడు ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడని తెలుస్తోంది. దీనికి సంబంధించిన కథనూ ఓకే చేశాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. బడ్జెట్‌ ఎక్కువగా ఉండటం వల్ల నిర్మాత ఎవరనే విషయంలో సందిగ్ధంలో ఉన్నాడట దర్శకుడు.

తాజాగా ఈ చిత్ర నిర్మాణ బాధ్యతలు చేపట్టడానికి వినోద్‌ కుమార్‌ ముందుకు వచ్చాడని సమాచారం. అధికభాగం మలేషియాలో చిత్రీకరణ జరుపుతారని తెలుస్తోంది. ఇందులో ప్రతినాయకుడి పాత్రలో ఆర్య నటించనున్నాడట. విశాల్‌-ఆర్య గతంలో 'వాడు-వీడు' చిత్రంలో కలిసి నటించారు.

లాక్‌డౌన్‌ పూర్తవ్వగానే ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆనంద్‌ శంకర్‌ ఇప్పటికే 'ఇరు మురుగన్‌', 'అరిమా నంబి'లాంటి సినిమాలు తెరకెక్కించారు. విజయ్‌ దేవరకొండ హీరోగా నటించిన 'నోటా' చిత్రానికి ఆనంద్‌ శంకరే దర్శకత్వం వహించాడు.

ఇదీ చూడండి.. అందమైన కుందనాల బొమ్మ.. రాశీ ముద్దుగుమ్మ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.