'చిరంజీవి, రవితేజ నుంచి చాలా నేర్చుకున్నా'

author img

By

Published : Jan 28, 2021, 3:39 PM IST

30 Rojullo Preminchadam Ela movie hero Pradeep special chitchat with ETV Bharat
ప్రముఖ వ్యాఖ్యాత ప్రదీప్​ స్పెషల్​ చిట్​చాట్​ ()

ప్రముఖ వ్యాఖ్యాత ప్రదీప్​ హీరోగా పరిచయమవుతున్న చిత్రం '30 రోజుల్లో ప్రేమించటం ఎలా?'. ఈ సినిమా శుక్రవారం (జనవరి 29) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈటీవీ భారత్​తో ప్రదీప్​ ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆ విశేషాలు మీకోసం..

అభిమాన హీరోల సినిమాలు చూసిన థియేటర్లలో తన చిత్రం విడుదల కానుండడం చాలా బాగుందని అంటున్నారు ప్రముఖ వ్యాఖ్యాత ప్రదీప్​. ఆయన నటించిన కొత్త చిత్రం '30 రోజుల్లో ప్రేమించటం ఎలా?'. శుక్రవారం (జనవరి 29) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈటీవీ భారత్​తో ప్రదీప్​ ముచ్చటించారు. ఆ విషయాలు మీకోసం..

హీరోగా అవడం ఎలా అని అనుకున్నారా?

అందరి లాగే సినిమాల్లోకి వెళ్లాలని, హీరోగా అవ్వాలని ఉండేది. కాలేజీలు బంక్​ కొట్టి చాలాసార్లు సినిమాలకు వెళ్లాను. అయితే సినిమాల్లోకి రావడానికి ముందు రేడియా, టీవీ కార్యక్రమాలతో గుర్తింపు తెచ్చుకున్నా. ఆ గుర్తింపే ఈ సినిమాలో అవకాశం వచ్చేలా చేసింది.

ఆర్టీసీ క్రాస్​ రోడ్స్ థియేటర్లలో మీరు చాలా సినిమాలు చూశారు కదా.. ఇప్పుడు అవే సినిమాహాళ్లలో మీ చిత్రం రాబోతుంది. మీ అనుభూతి ఏంటి?

సుదర్శన్​, సంధ్య థియేటర్లలో చాలా సినిమాలు చూశాను. 'తమ్ముడు' చిత్రాన్ని తొమ్మిది సార్లు చూశా. అలా అక్కడి టికెట్లు ఇచ్చే వాళ్లకూ నేను పరిచయమే. అయితే అందులో నా సినిమా ప్రదర్శించబోతున్నారనే అనుభూతి చాలా బాగుంది. అయితే దీనిపై మా నాన్న మాట్లాడుతూ.. 'ఇది ఇక్కడితో ఆగకూడదు. ఇంకా కష్టపడు' అని ఆయన అన్నారు.

మీరు ఎంతోమంది హీరోలను ఇంటర్వ్యూ చేశారు. వారి నుంచి మీరు నేర్చుకున్నవి షూటింగ్​లో ఎలా పనికొచ్చాయి?

చిరంజీవి, రవితేజ వంటి హీరోలను ఇంటర్వ్యూ చేశాను. వారి నుంచి చాలా నేర్చుకున్నా. కథే ముఖ్యం అని చాలామంది చెప్పారు. అది నిజం. ప్రతిరోజు షూటింగ్​కు వెళ్లే ముందు కొత్తగా ఉన్నట్లు ఫీల్​ అవుతా. నిన్న ప్రివ్యూ చూశాను. దానికి ఒక జంట, వృద్ధులను, మరి కొంతమందిని ఆ ప్రివ్యూకు తీసుకెళ్లాను. వాళ్లు సినిమా చూస్తున్నప్పుడు వాళ్ల హావభావాలను వెనుక నుంచి గమనించాను. మూవీ అయిపోయిన తర్వాత బాగుందని వారంతా చెప్పారు. అది నాలో చాలా ఆనందాన్ని నింపింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.