ETV Bharat / science-and-technology

YouTubers Failing Reasons : మీ యూట్యూబ్ ఛానల్ సక్సెస్ కావాలా?.. ఈ తప్పులు చేయకండి!

author img

By

Published : Aug 20, 2023, 1:56 PM IST

YouTubers Failing Reasons In Telugu : ఈ రోజుల్లో చాలా మందికి యూట్యూబ్ ఛానల్స్​ ఉంటున్నాయి. కొవిడ్ మహమ్మారి విజృంభించిన కాలంలోనూ.. ఆ తరువాత కూడా.. లక్షలాది యూట్యూబ్​ ఛానల్స్ పుట్టుకొచ్చాయి. కానీ అందులో విజయవంతమైనవి మాత్రం కేవలం కొన్నే. మ‌రి మీకూ ఓ యూట్యూబ్​ ఛాన‌ల్ ఉందా? మరి అది విజ‌య‌వంతం కావాలంటే ఏమేమి చేయాలి? ఎలాంటి తప్పులు చేయకూడదు?.. అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

youtube success mantra
YouTubers Failing Reasons

YouTubers Failing Reasons : యూట్యూబ్‌.. కోట్లాది యూజర్లు ఉన్న గొప్ప డిజిట‌ల్ ప్లాట్​ఫాం. ప్ర‌పంపవ్యాప్తంగా దీనికి కంటెంట్ క్రియేట‌ర్లు ఉన్నారు. కొంత‌ మందికి ఇదొక ఆసక్తి, టైమ్ పాస్ అయితే.. ఇంకొంత మందికి ఇదే జీవ‌నాధారం. యూట్యూబ్​లో.. వీడియోలు అప్​లోడ్​ చేసి, AdSense రెవెన్యూ సంపాదించ‌వ‌చ్చు. చాలా మందికి ఛాన‌ళ్లు ఉన్నా.. అందులో స‌క్సెస్ అయ్యేది మాత్రం కేవలం నూటికి ఒక్కరే. మీరు కూడా యూట్యాబ్ ఛానల్​ పెట్టి, మంచి విజయవంతంగా దానిని నడపాలని ఆశిస్తున్నారాా? అయితే కొన్ని రకాల త‌ప్పులు అస్స‌లు చేయకండి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. డ‌బ్బు సంపాద‌నే ల‌క్ష్యంగా పెట్టుకోకండి!
YouTube AdSense Earnings : చాలా మంది కంటెంట్ క్రియేషన్ ద్వారా సుల‌భంగా డ‌బ్బు సంపాదించాల‌ని ఛాన‌ల్ స్టార్ట్ చేస్తారు. కానీ ఇది స‌రైన పద్ధతి కాదు. యూట్యాబ్​ ఛాన‌ళ్లు విజ‌య‌వంతం కావాలంటే.. దానికి ఎంతో కృషి, ప‌ట్టుద‌ల అవసరం. మీరు ఛాన‌ల్ ప్రారంభించిన త‌ర్వాత డ‌బ్బు రావ‌డానికి చాలా స‌మ‌యం ప‌ట్టే అవకాశం ఉంది. యూట్యూబ్ నిబంధ‌న‌ల ప్ర‌కారం.. 1000 మంది స‌బ్ స్క్రైబ‌ర్లు, 4000 గంట‌ల వాచింగ్ అవ‌ర్స్ కావాలి. ఈ గోల్ రీచ్ అయిన త‌ర్వాతే డ‌బ్బు రావ‌డం స్టార్ట్ అవుతుంది. అప్ప‌టిదాకా మీకు ఎంత మంది స్పాన్స‌ర్లు ఉన్నా లాభం లేదు.

youtube money making
కేవలం సంపాదన కోసం మాత్రమే యూట్యూబ్​ ఛానల్ పెట్టకూడదు!

2. ఇత‌ర ఛాన‌ళ్ల నుంచి కంటెంట్ కాపీ కొట్ట‌వద్దు!
Content Copyright Issue : కంటెంట్ కాపీ కొట్ట‌డం యూట్యూబ్​లో సర్వసాధారణంగా కనిపిస్తుంది. కానీ సాధ్య‌మైనంత వ‌ర‌కు అలా చేయ‌కండి. ఒక నిర్దిష్ట థీమ్ ఎంచుకుని దానికి అనుగుణంగా కంటెంట్ త‌యారు చేసుకుని వీడియోలు చేయండి. ఆ రంగంలో ఎప్ప‌టిక‌ప్పుడు అప్​డేట్లు ఇస్తూ, కొత్త‌ద‌నాన్ని వీక్ష‌కులకు ప‌రిచ‌యం చేయండి. వ్యూయర్స్​ మీకు క‌నెక్ట్ అయ్యేలా వీడియోలు రూపొందించండి. మంచి కంటెంట్ అందిస్తే.. ఫాలోవ‌ర్లు ఆటోమేటిక్​గా పెరుగుతారు.

Common Reasons YouTube Channels Fail
యూట్యూబ్​ కోసం ఇతర సోషల్​ మీడియా కంటెంట్​ వాడకూడదు!

3. అన్ని వీడియోల్లో ఒకే సౌండ్ ఉప‌యోగించరాదు!
YouTube Music : ఛానల్ ప్రారంభంలో కాపీరైట్ లేని పాట‌లను బ్యాగ్రౌండ్ మ్యూజిక్​గా పెడ‌తారు. త‌ర్వాతి కాలంలోనూ ఎలాంటి ఇబ్బంది ఉండ‌కుండా వాటినే ఉప‌యోగిస్తారు. ప్ర‌తి వీడియోకి ఒకే ర‌క‌మైన సంగీతం పెట్ట‌డం వ‌ల్ల వీక్ష‌కులు విసిగెత్తిపోతారు. కనుక కొత్త వాటిని ట్రై చేయండి. ఇంకా కొంత మంది కాపీరైట్ క‌లిగిన వాటిని వాడుకుంటారు. దీని వల్ల కాపీరైట్​ స్ట్రైక్ పడుతుంది. ఇలా మూడు సార్లు కంటే ఎక్కువ సార్లు జరిగితే.. యూట్యూబ్​.. మీ ఛానల్​ను​ పూర్తిగా తొలగిస్తుంది. జాగ్రత్త!

youtube sounds
మీ యూట్యూబ్​ వీడియోలు అన్నింటిలో ఒకే మ్యూజిక్​ వాడకూడదు!

3. సేమ్ కంటెంట్ వ‌ద్దు!
YouTube Content Ideas : కొంత‌ మంది ప‌ర్టిక్యుల‌ర్ స‌బ్జెక్ట్స్ మీద‌నే వీడియోలు చేస్తారు. ఛాన‌ల్ ప్రారంభించిన మొదట్లో ఇలా చేయ‌డం వల్ల కొంత‌ వ‌ర‌కు కీడు జ‌రిగే అవకాశం ఉంది. ఒకే ర‌క‌మైన కంటెంట్​కు ప‌రిమితం కావ‌డం వ‌ల్ల అంత‌కు ముందు ఉన్న ఛాన‌ళ్ల నుంచి పోటీ ఎదుర‌య్యే ఛాన్సుంది. అప్ప‌టికే వాళ్లు పేరు పొంది ఉంటారు. కనుక మీ వీడియోలు చూడ‌టం క‌ష్ట‌మ‌నే చెప్పాలి. ప్ర‌త్యేక‌మైన, తాజా కంటెంట్ అందించ‌డం వ‌ల్ల మీ ఛానల్​కు ఆద‌ర‌ణ పెరిగే అవ‌కాశ‌ముంది. వాటిపై దృష్టి పెడితే మంచిది.

4. ఇత‌ర యూట్యూబ‌ర్​ల టెక్నిక్స్​ను అనుక‌రించకూడదు!
YouTuber Techniques : కొంత‌మంది జ‌నాద‌ర‌ణ పొందిన ఛాన‌ళ్ల వీడియోలను, ఎడిటింగ్ టెక్నిక్​ల‌ను కాపీ కొడ‌తారు. అలా చేయ‌డం వల్ల వాళ్ల ఛానల్ కూడా ప్రాచుర్యంలోకి వ‌స్తుంద‌ని భావిస్తుంటారు. కానీ ఇది త‌ప్పు. ఫేమ‌స్ యూట్యూబ‌ర్​ల‌లో ఒక‌రైన మిస్ట‌ర్ బీస్ట్​ను తీసుకుంటే.. చాలా మంది అత‌ని కంటెంట్‌ను, శైలిని, కంప్యూట‌ర్ టెక్నిక్​ల‌ను కాపీ కొడుతుంటారు. కానీ ఎవ‌రూ కూడా ఆయ‌నంత ఫేమ‌స్ కాలేక‌పోయారు. అలాంటి వారిని కాపీ కొట్ట‌డం వ‌ల్ల మీరూ అదే స్థాయికి చేరుకుంటార‌ని ఆశించ‌డం మంచిది కాదు.

5. విచిత్ర‌మైన థంబ్​ నెయిల్స్ వాడ‌కం!
YouTube thumbnail : అనేక మంది యూట్యూబ‌ర్లు​.. త‌మ వీడియోకి విచిత్ర‌మైన థంబ్ నెయిల్స్ పెడ‌తారు. అతిశ‌యోక్తులతో కూడిన టైటిల్స్, ఫొటోలు పెడ‌తారు. ఉదాహ‌ర‌ణ‌కు ఎవ‌రైనా క్రియేట‌ర్ విదేశాల‌కు వెళ్లినప్పుడు తాను తిరిగిన ప్రాంతాల గురించి త‌క్కువ‌గా చెప్పి.. వివాదాస్ప‌ద అంశాలను హైలెట్ చేస్తారు. వీరి వీడియోలు టైటిల్​కి త‌గిన‌ట్లుగా ఉండ‌వు. ఇలాంటివి చేయ‌డం వల్ల ప్రారంభంలో బాగానే వ్యూస్ వ‌స్తాయి. కానీ క్ర‌మంగా ఆ వ్యూస్ ప‌డిపోయే అవకాశం ఉంటుంది.

6. పూర్తిగా యాడ్ సెన్స్ ఆదాయంపైనే ఆధార‌ప‌డ‌టం!
YouTube AdSense Revenue : యూట్యూబ‌ర్‌లు Google AdSense ద్వారా ఎక్కువ డబ్బు సంపాదిస్తారనేది ఒక అపోహ మాత్రమే. వాస్తవానికి మీ వీడియోలకు నెల‌కు క‌నీసం ల‌క్ష వ్యూస్ దాటితే.. మంచి డ‌బ్బులు వ‌స్తాయి. లేదంటే.. ఛానల్​ మెయింటెనెన్స్​ డబ్బులు కూడా రావు. ఆన్​లైన్​ AdSense కాలిక్యులేటర్​ల‌ను చూసి మీరి నమ్మి మోసపోవద్దు. అవి వాస్తవానికి చాలా విరుద్ధంగా ఉంటాయి. ఒక 'వ్యూ'కు (వీక్షణకు) YouTube $0.003 నుంచి $0.005 చెల్లిస్తుంద‌ని అంచనా. అందువల్ల సదరు వీడియోకు వచ్చిన వ్యూస్ ఆధారంగానే యాడ్​సెన్స్ రెవెన్యూను లెక్కించాల్సి ఉంటుంది.

youtube adsense
కేవలం యూట్యూబ్​ యాడ్​సెన్స్ ఆదాయంపై ఆధారపడకూడదు!

7. యూట్యూబ్ కోర్సుల విషయంలో జాగ్రత్త!
YouTube Course : కొంత మంది తమ ఛానల్​ను మెరుగుప‌ర్చుకోవ‌డానికి ప‌లు కోర్సులు నేర్చుకుంటారు. అలాగే యూట్యూబ్​ స్టూడియో కోసం అవసరమైన విలువైన వ‌స్తువులను కొనుగోలు చేస్తారు. ఇది కొంత‌ వ‌ర‌కు మంచిదే అయినా.. అందులో నిర్ల‌క్ష్యంగా పెట్టుబ‌డి పెట్టవద్దు అని నిపుణులు సూచిస్తున్నారు. కొన్ని యూట్యూబ్​ కోర్సులు మిమ్మల్ని ప‌క్క‌దారి ప‌ట్టించే అవకాశం ఉంది. అందుకే వాటి పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. అందుకే వాటికి బ‌దులుగా ఎడిటింగ్ నైపుణ్యాలు నేర్చుకోవ‌డానికి ప్రయత్నించండి. కొత్త కంటెంట్ క్రియేట‌ర్ల కోసం Udemy, Skillshare, Masterclass, Coursera లాంటి ప్రోగ్రాములున్నాయి.

నోట్​ : విజయవంతమైన YouTube ఛాన‌ల్‌ని నిర్మించడం అంత తేలికైన పని కాదు. స్థిరంగా వీడియో క్రియేష‌న్​పై దృష్టి పెట్టాలి. తప్పులను నివారించుకుంటూ ముందుకెళ్లాలి. అప్పుడే మీ యూట్యూబ్ ఛానల్ విజయవంతమయ్యే అవకాశాలు మెరుగవుతాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.