ETV Bharat / science-and-technology

WhatsApp Passkeys Feature : వాట్సాప్​ 'పాస్​కీస్​' ఫీచర్​తో.. మీ అకౌంట్ మరింత భద్రం.. హ్యాకింగ్​కు నో ఛాన్స్​!

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 23, 2023, 5:02 PM IST

Whatsapp New Features 2023
WhatsApp Passkeys Feature

WhatsApp Passkeys Feature : వాట్సాప్​ తమ యూజర్ల భద్రత కోసం పాస్​కీస్​ పేరుతో మరో సరికొత్త ఫీచర్​ను అందుబాటులోకి తెచ్చింది. దీని వల్ల మీ వాట్సాప్ ఖాతా మరింత సురక్షితం అవుతుంది. ఒకవేళ ఎవరైనా వాట్సాప్ సర్వర్​ను హ్యాక్​ చేసినా.. మీ ఖాతాను మాత్రం యాక్సెస్ చేయలేరు. కనుక మీ డేటా భద్రంగా ఉంటుంది. మరి దీని పూర్తి వివరాలు గురించి ఇప్పుడు తెలుసుకుందామా?

WhatsApp Passkeys Feature : ప్రముఖ మెసేజింగ్​ ప్లాట్​ఫామ్​ వాట్సాప్​ మరో సరికొత్త సెక్యురిటీ ఫీచర్​తో మొబైల్​ వినియోగదారుల ముందుకు వచ్చేసింది. దీని సాయంతో ఇకపై ఆండ్రాయిడ్ యూజర్లు పాస్‌వర్డ్​ లేకుండానే ఈజీగా వాట్సాప్​లోకి లాగిన్ కావచ్చు. 'WhatsApp Passkeys' పేరుతో ప్రత్యేకంగా ఆండ్రాయిడ్​ వినియోగదారుల కోసం దీనిని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు మెటా తెలిపింది. అయితే ప్రస్తుతానికి ఈ అప్డేట్​​ను కొంతమంది యూజర్స్​ మాత్రమే అందుబాటులోకి తెచ్చామని.. దశలవారీగా మిగతావారి కోసం కూడా ఈ ఫీచర్​ను అందుబాటులోకి తేస్తామని వాట్సాప్​ ప్రకటించింది.

వాట్సాప్​ పాస్​కీస్​ అంటే ఏంటి?
వాట్సాప్​ పాస్​కీస్​ (WhatsApp Passkeys Feature) ఫీచర్ సాయంతో​ మీ వాట్సాప్​ను పాస్​వర్డ్​ లేకుండానే ఓపెన్​​ చేయవచ్చు. ఇందుకు ఈ నయా ఫీచర్​ అనుమతిస్తుంది. అయితే ఈ పాస్​కీ​ అనేది మీ వాట్సాప్ సర్వర్‌కు బదులుగా యూజర్ ఫోన్‌లో స్టోర్ అవుతుంది. మొదటిసారిగా ఈ పాస్​కీని అన్​లాక్​ చేయడానికి మొబైల్​ ఫింగర్​ ప్రింట్​ లేదా ఫేస్​ స్కానర్​ లేదా ఫోన్​ పిన్​ను ఉపయోగించవచ్చు.

సాధారణంగా ఫోన్‌ మార్చినప్పుడు లేదా వాట్సాప్​ను డిలీట్ చేసి మళ్ళీ రీ-ఇన్‌స్టాల్ చేసినప్పుడు వాట్సాప్ అకౌంట్‌లోకి మళ్లీ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అలా చేయడానికి మాములుగా మన ఫోన్ నంబర్​కు SMS ద్వారా వాట్సాప్ పంపే ఓటీపీ కోడ్​ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్‌ట్రా సెక్యూరిటీ కోసం ఒక్కోసారి ఆరు అంకెల పిన్‌ లేదా టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్(2FA)ను కూడా సెటప్ చేసుకోవాల్సి వస్తోంది. అయితే ఇప్పుడు వచ్చిన WhatsApp Passkeys అనే సింపుల్​ ఫీచర్​తో ఈ ప్రక్రియ అంతా చేయాల్సిన పని ఉండదు.

గూగుల్ కూడా..
గూగుల్‌ లాంటి దిగ్గజ కంపెనీలు కూడా ఇప్పటికే పాస్​కీస్ ఫీచర్​ను అందుబాటులోకి తెచ్చాయి. వీటి ద్వారా మీ అకౌంట్ చాలా సురక్షితం అవుతుంది. ఎందుకంటే పాస్‌కీలు అనేవి ట్రెడిషనల్​ పాస్‌వర్డ్‌ల కంటే చాలా సురక్షితమైనవి. కనుక మీరు మరింత వేగవంతమైన, సురక్షితమైన సేవలను పొందగలుగుతారు.

మీరు మాత్రమే..
పిన్‌, ఓటీపీల కంటే పాస్​కీస్​.. అత్యంత సురక్షితమైన పద్ధతని వాట్సాప్ చెబుతోంది. పబ్లిక్ కీ క్రిప్టోగ్రఫీ అనే ప్రత్యేకమైన టెక్నాలజీ ద్వారా ఈ పాస్‌కీస్​ ఎన్​క్రిప్ట్ అవుతాయి. అంటే యూజర్​ మాత్రమే ఈ పాస్‌కీస్​ను యాక్సెస్ చేయగలరు. అంతేకాకుండా ఎవరైనా వాట్సాప్ సర్వర్‌ను హ్యాక్ చేసినా.. మీ వాట్సాప్​ అకౌంట్​లోకి మాత్రం లాగిన్​ అవ్వలేరు. ఎందుకంటే ఆ పాస్​కీ మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు.

వాట్సాప్​లో ఈ ఫీచర్​ను ఎనేబుల్​ చేసుకోండిలా..

  • ముందుగా వాట్సాప్​ ఓపెన్​ చేసి సెట్టింగ్స్​లోకి వెళ్లండి.
  • తర్వాత అకౌంట్​పై క్లిక్ చేసి 'Passkeys' ట్యాబ్​ను నొక్కండి.
  • అనంతరం మీ మొబైల్​లో 'Passkeys' తెరుచుకుంటుంది. అక్కడ 'Create a Passkey' అనే ఆప్షన్​ను సెలెక్ట్​ చేయండి.
  • ఇప్పుడు పాస్‌కీస్ ఎలా పని చేస్తాయో వివరించే మెసేజ్​ను చదివి 'Continue'పై క్లిక్​​ చేయండి.
  • 'వాట్సాప్ కోసం పాస్‌కీని క్రియేట్​ చేయాలనుకుంటున్నారా?' అని గూగుల్ పాస్‌వర్డ్ మేనేజర్​ నుంచి మీకు ఇంకో సందేశం వస్తుంది.
  • తరువాత కంటిన్యూపై నొక్కి, స్క్రీన్ లాక్​ను ఉపయోగించాలి.
  • చివరగా వాట్సాప్ క్రియేట్ చేసిన పాస్‌కీను మీరు చూడవచ్చు. దీంతో మీ Passkeys ప్రాసెస్​ పూర్తవుతుంది.

నోట్​ : మీరు ముందుగా మీ ఆండ్రాయిడ్​ ఫోన్​లో గూగుల్​ అకౌంట్​తో లాగిన్​ అవ్వాలి. అయితే మీ డివైజ్​లోని అన్ని గూగుల్​ యాప్స్​ను లేటెస్ట్​ వెర్షన్​లోకి అప్డేట్ చేసుకుంటేనే ఈ ఫీచర్​ పనిచేస్తుంది. ఒకవేళ మీకు ఈ ఫీచర్​ మీ మొబైల్స్​లో చూపించకపోతే మరేమీ చింతించకండి. వాట్సాప్ దానిని క్రమంగా రోలవుట్ చేస్తోంది.. కనుక త్వరలోనే అది మీ డివైజ్​లో కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అర్థం చేసుకోండి.

WhatsApp Dual Account Feature : ఒకే ఫోన్​లో రెండు వాట్సాప్‌ ఖాతాలు​.. ఎలా క్రియేట్​ చేయాలంటే?

Whatsapp New Features Today : వాట్సాప్​ చాట్స్​కు ఇక లాక్​తోపాటు​ హైడ్​.. వాయిస్​ మెసేజెస్​కు 'వ్యూ వన్స్​'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.