ETV Bharat / science-and-technology

WhatsApp Secret Code Feature : వాట్సాప్ సీక్రెట్​ కోడ్​తో.. మీ ఛాట్స్​ మరింత భద్రం!

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 10, 2023, 4:03 PM IST

whatsapp-new-features-hide-chat-secret-code-for-android-users
WhatsApp Secret Code Feature

WhatsApp Secret Code Feature In Telugu : ప్రముఖ సామాజిక మధ్యమం వాట్సాప్​.. మరో సరికొత్త ఫీచర్​ తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఛాట్​ ప్రైవసీని మరింత పటిష్టం చేసేందుకు 'సీక్రెట్ కోడ్'​ ఫీచర్​ను రూపొందిస్తోంది. పూర్తి వివరాలు చూద్దాం రండి.

WhatsApp Secret Code Feature : వాట్సాప్​ తమ యూజర్ల సౌకర్యం కోసం మరో కొత్త ఫీచర్​ను తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.​ ముఖ్యంగా యూజర్లు తమ​ ఛాట్​లను ఇతరులు ఎవరూ చూడకుండా 'సీక్రెట్ కోడ్'​ పెట్టుకునే విధంగా ఈ ఫీచర్​ను రూపొందిస్తుంది. ఈ కొత్త ఫీచర్​తో యూజర్​ తమ​ ఛాట్​లను ఇతరులు చూడకుండా జాగ్రత్త పడొచ్చు. ఈ సీక్రెట్​ కోడ్​.. మీ ఛాట్​లకు ఒక పాస్​వర్డ్​ వలే పనిచేస్తుంది.

ఆ నయా ఫీచర్​ కనుక అందుబాటులోకి వస్తే.. పదాలను లేదా ఎమోజీలను సీక్రెట్​ కోడ్స్​గా పెట్టుకోవడానికి వీలవుతుంది. ఒక వేళ మీరు హైడ్​ చేసిన చాట్​లను మరలా చూడాలని అనుకుంటే.. సెర్చ్​బార్​లో ఈ సీక్రెట్ కోడ్​ను టైప్​ చేయాలి. అప్పుడు మీరు హైడ్​ చేసిన ఛాట్ ఓపెన్ అవుతుంది. ప్రస్తుతానికి ఈ ఫీచర్​ టెస్టింగ్​ దశలోనే ఉంది. త్వరలోనే ఆండ్రాయిడ్​ యూజర్లు అందరికీ ఇది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

వాట్సాప్​ ఛాట్​ను ఆర్కైవ్ చేయడం ఎలా?
How to Archive WhatsApp chats : మన వాట్సాప్​ ఛాటింగ్​ ఇతరులెవ్వరికీ కనిపించకుండా చేయాలంటే.. దానిని ఆర్కైవ్ చేయాల్సి ఉంటుంది. అందుకే వాట్సాప్ ఛాట్​ని ఎలా ఆర్కైవ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1. మొదట మొబైల్​లో వాట్సాప్ యాప్​ను ఓపెన్ చేయాలి.

2. హైడ్​ చేయాలనుకుంటున్న ఛాట్​పై లాంగ్​ప్రెస్​ చేయాలి.

3. అనంతరం హోంపేజీ పైన డౌన్​ యారో ఆప్షన్​పై క్లిక్​ చేయాలి. అప్పుడు వెంటనే చాట్​ మొత్తం ఆర్కైవ్ అవుతుంది.

4. మీరు కనుక ఆర్కైవ్ చేసిన ఛాట్​ను మరలా చూడాలని అనుకుంటే.. సెర్చ్​బార్​లో సెర్చ్​ చేస్తే సరిపోతుంది. లేదంటే కిందకి స్క్రోల్​ చేసినా అది మీకు కనిపిస్తుంది.

వాట్సాప్​కు ఫింగర్​ప్రింట్​ లాక్​ ఆఫ్షన్​ పెట్టుకోవడం ఎలా?
How To Put Fingerprint Lock On WhatsApp : వాట్సాప్​​కు ఫింగర్​ప్రింట్​ లాక్​ ఆఫ్షన్ పెట్టుకోవాలంటే ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి.

1. మొదట వాట్సాప్​ను ఓపెన్​ చేయండి.

2. హోం పేజీపైన రైట్​ కార్నర్​లో ఉండే మూడు డాట్స్​పై క్లిక్​ చేయండి.

3. అనంతరం సెట్టింగ్స్​లోకి వెళ్లండి.

4. క్రిందికి స్క్రోల్ చేస్తే.. ఫింగర్​ప్రింట్​ లాక్ ఆఫ్షన్​ కనిపిస్తుంది.

5. మీరు సింపుల్​గా ఫింగర్​ప్రింట్​ లాక్ ఆఫ్షన్ ఆన్​ చేసుకుంటే సరి.

How to Use Umang App and its Features : ఒక్క ఉమాంగ్ యాప్​తో ఎన్నో ప్రభుత్వ సేవలు.. ఇలా వాడేయండి!

How To Build A Low Cost YouTube Studio : యూట్యూబ్​ స్టూడియో పెట్టాలా?.. బడ్జెట్లో బెస్ట్ (ఎక్విప్​మెంట్​​) ఆప్షన్స్ ఇవే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.