ETV Bharat / science-and-technology

వాట్సాప్ నుంచి మాయమవుతారా?.. ఈ 'ఘోస్ట్' ఫీచర్లు మీకోసమే!

author img

By

Published : Mar 26, 2023, 11:19 AM IST

వాట్సాప్ నుంచి మాయం కావాలని అనుకుంటున్నారా? యాప్ వాడుతున్నా.. ఎవరికీ తెలియకూడదని భావిస్తున్నారా? అయితే.. ఈ వాట్సాప్ 'ఘోస్ట్' ఫీచర్లు మీకోసమే! చూసేయండి!!

whatsapp privacy status seen
whatsapp privacy status seen

ఫ్రెండ్స్, ఫ్యామిలీతో టచ్​లో ఉండటానికి బెస్ట్ ఆప్షన్ వాట్సాప్. కానీ, ఇందులోనూ కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఎప్పుడు ఆన్​లైన్​లోకి వచ్చామో చూడాలని కాచుకుకూర్చునే మాజీ ప్రియులు, రాత్రి ఎప్పటివరకు ఫోన్ వాడారోనని గమనించే కుటుంబ సభ్యులు, మనం ఏఏ డీపీలు మారుస్తున్నామో గమనించే స్టాకర్లు.. ఇలా వాట్సాప్​ ద్వారా మన గురించి తెలుసుకునే వారు చాలా మందే ఉంటారు. వారితో దీని గురించి మాట్లాడలేం. ఇలా ఎందుకు చేస్తున్నారని మనం అడగలేం. కుటుంబ సభ్యులను బ్లాక్ చేయాలన్న ఆలోచనే ఎవరికీ ఉండదు. అలాంటప్పుడే వాట్సాప్ ప్రైవసీ ఫీచర్లపై మీరో లుక్కేయాలి. ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టే ఆప్షన్లు వాట్సాప్​లో బోలెడు ఉన్నాయి. వీటిని ఉపయోగించి మీరు ఎవరికీ తెలియకుండా వాట్సాప్​ను ఉపయోగించుకోవచ్చు. ఈ ఫీచర్లతో వాట్సాప్ నుంచి మెజీషియన్​లా మాయం కావచ్చు. మరి ఆ 'ఘోస్ట్' ఫీచర్లేంటో చూద్దామా?

లాస్ట్ సీన్, ఆన్​లైన్ స్టేటస్​ కనిపించకుండా చేయడం..
వాట్సాప్​లో ముఖ్యమైన వ్యక్తులతో బిజీగా ఉండి కొందరి మెసేజ్​లకు రిప్లై ఇవ్వలేకపోతే వారు నొచ్చుకునే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే వాట్సాప్​లో మనం ఆన్​లైన్​లోకి వచ్చామన్న విషయాన్ని తెలియనీయకుండా చేయాలి. అందుకు వాట్సాప్​లో ప్రైవసీ ఫీచర్లు ఉన్నాయి. లాస్ట్ సీన్, ఆన్​లైన్ స్టేటస్ కనిపించకుండా చేస్తే ఈ సమస్యకు పరిష్కారం లభించినట్లే. సెట్టింగ్స్​లోని ప్రైవసీ ఆప్షన్​కు వెళ్లి.. అందులోని 'లాస్ట్ సీన్'ను 'నోబడీ'కి సెట్ చేయాలి. అలాగే ఆన్​లైన్ స్టేటస్​ను సైతం 'సేమ్ యాస్ లాస్ట్ సీన్'గా మార్చాలి.

బ్లూ టిక్​లు లేకుండా చేయడం..
వాట్సాప్​లో మెసేజ్​లను చూసిన తర్వాత బ్లూకలర్​లో డబుల్ టిక్ మార్క్ పడుతుంది. అలా బ్లూ టిక్ పడనీయకుండా చేయాలంటే 'రీడ్ రిసీప్ట్స్​'ను టర్న్ ఆఫ్ చేయాలి. ఇలా చేయడం ద్వారా మనం ఇతరుల మెసేజ్​లు ఓపెన్ చేసినా.. వారికి బ్లూ టిక్ పడదు. సెట్టింగ్స్​లోని ప్రైవసీ ఆప్షన్​లో ఉండే రీడ్ రిసీప్ట్స్ ఆప్షన్​ను స్విచ్ ఆఫ్ చేయాలి.

స్టేటస్ అప్డేట్లపై నియంత్రణ..
వాట్సాప్​లో స్టేటస్ అప్డేట్లను సైతం నచ్చినవారితోనే పంచుకునే వీలుంది. కాంటాక్టుల్లోని కొందరికి స్టేటస్ హైడ్ చేసే ఆప్షన్ గతంలో ఉండగా.. కాంటాక్టుల్లోని కొందరికి తప్ప మిగిలినవారందరికీ పంపించేలా కొత్త అప్డేట్ తీసుకొచ్చింది వాట్సాప్. వీటిని ఉపయోగించుకొని స్టేటస్​లను నచ్చిన వారికే కనిపించేలా చేసుకోవచ్చు. స్టేటస్ పెట్టే ముందు అదే స్క్రీన్​పై ఆడియన్స్ ట్యాప్ ఉంటుంది. మనకు నచ్చినట్లు అక్కడే ఆప్షన్స్ మార్చుకోవచ్చు. సెట్టింగ్స్​లోని ప్రైవసీ ట్యాబ్​లో ఉన్న 'స్టేటస్' విభాగంలోనూ ఇందుకు సంబంధించిన ఆప్షన్స్ కనిపిస్తాయి.

ప్రొఫైల్ ఫొటో
వాట్సాప్​లో పెట్టుకునే ప్రొఫైల్ ఫొటోను సైతం కనిపించకుండా చేసుకోవచ్చు. డీఫాల్ట్​గా వాట్సాప్ డీపీ.. కాంటాక్టుల్లోని వ్యక్తులకు మాత్రమే కనిపిస్తుంది. దీన్ని ఎవరికీ కనిపించకుండా కూడా చేసుకోవచ్చు. సెట్టింగ్స్​, ప్రైవసీ ఆప్షన్​లోని ప్రొఫైల్ ఫొటోపై క్లిక్ చేసి 'నోబడీ'ని ఎంచుకుంటే సరిపోతుంది.

ఎబౌట్ సెక్షన్​ను హైడ్ చేయడం
వాట్సాప్​లో పై ఫీచర్లన్నింటినీ ఉపయోగించిన తర్వాత కూడా మరింత గోప్యత కావాలంటే.. ఎబౌట్​ను సైతం హైడ్ చేసేయండి. ఎబౌట్ సైతం కనిపించకపోతే అసలు మీరు వాట్సాప్​లో ఉన్నారో, లేరో అనే భ్రమ కూడా కలుగుతుంది. సెట్టింగ్స్, ప్రైవసీలోని ఎబౌట్ ఆప్షన్​లోకి వెళ్లి హైడ్ చేసుకోవచ్చు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.