ETV Bharat / science-and-technology

వాట్సాప్ కొత్త గ్రూప్​​ ఫీచర్స్​.. మెసేజింగ్​ మరింత సులువుగా.. భద్రంగా!

author img

By

Published : Mar 23, 2023, 2:52 PM IST

new whatsapp group features
new whatsapp group features

మెసేజింగ్​ను మరింత సులువుగా, భద్రంగా మార్చేందుకు ప్రయత్నిస్తోంది వాట్సాప్​. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తూ.. వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే వాట్సాప్​ గ్రూప్​లకు సంబంధించిన మరికొన్ని ఫీచర్లను తీసుకురాబోతుంది. వాటి గురించి తెలుసుకుందాం.

తమ వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు తీసుకొస్తూనే ఉంది ప్రముఖ మెసేజింగ్​ యాప్​ వాట్సాప్​. రకరకాల ఫీచర్లు యాడ్​ చేసుకుంటూ మెసేజింగ్​ను మరింత సులువుగా, భద్రంగా చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో వాట్సాప్​ గ్రూప్​లకు సంబంధించిన మరికొన్ని ఫీచర్లు తీసుకురాబోతోంది.
ఒకరికన్నా ఎక్కువ మందితో సమాచారాన్ని పంచుకునేందుకు చేసుకునేందుకు, అభిప్రాయాల్ని తెలియజేసేందుకు వాట్సాప్‌ గ్రూప్‌లను క్రియేట్​ చేస్తారు. కానీ, కొన్ని సందర్భాల్లో ఒకే విషయాన్ని వేర్వేరు గ్రూప్‌లలో షేర్‌ చేస్తారు కొందరు గ్రూప్​ సభ్యులు. అలా చేయడం విసుగు తెప్పిస్తుంది. ఇలాంటి గ్రూప్​లకు అడ్మిన్​లుగా ఉన్నావారికి.. ఆ మెసేజ్​లను హ్యాండిల్​ చేయడం కష్టమవుతుంది. అలాంటి సమస్యలకు పరిష్కారంగా కొత్త ఫీచర్లను వాట్సాప్‌ తీసుకురాబోతుంది. ఆ ఫీచర్లు ఏంటి? వాటితో యూజర్లుకు ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో చూద్దాం.

ప్రైవసీ ఫీచర్..
గ్రూప్‌లో జాయిన్​ అయ్యే లింక్‌ను షేర్ చేసినప్పుడు, గ్రూప్‌ను కమ్యూనిటీలో చేరేలా చేసినప్పుడు.. గ్రూప్‌లోకి అనుమతించాలనుకునే వ్యక్తులను అడ్మిన్లు సులభంగా ఎంచుకోవడానికి ఈ ఫీచర్​ సహాయపడుతుంది. దీంతో ఎవరు పడితే వారు గ్రూపుల్లో చేరలేరు. ఎలాంటి అనవసర వ్యాఖ్యానాలు చేయడానికి వీలుండదు. దీనివల్ల ​గ్రూప్​ను సురక్షితంగా ఉంచడం ఈజీ అవుతుంది.

కామన్​ ఇన్​ గ్రూప్స్​..
ఎవరైన ఒక వ్యక్తి మనతో పాటు ఏయే గ్రూపుల్లో ఉన్నాడో సులభంగా తెలుసుకోవచ్చు. అతడి పేరును సెర్చ్ చేస్తే అతడు, ఏయే గ్రూప్​ల్లో కామన్​గా ఉన్నారో లిస్టు వస్తుంది.
అయితే, ఈ ఫీచర్లు త్వరలో యూజర్లకు అందుబాటులోకి రానున్నాయి

ఇంతకుముందు వాట్సాప్ తీసుకొచ్చి​ కొన్ని ముఖ్యమైన గ్రూప్​ ఫీచర్లు:
ఒకే గ్రూప్‌లో 1024 మంది
గ్రూప్‌ సభ్యుల గరిష్ట సంఖ్యను 1024కు వాట్సాప్​ పెంచింది. దీంతో ఒకేసారి ఎక్కువ మందితో సమాచారాన్ని సులువుగా షేర్‌ చేసుకోవచ్చు.

గ్రూప్‌ కాలింగ్
అంతకుముందు వరకు వాట్సాప్‌లో ఒకేసారి ఎనిమిది మంది మాత్రమే వీడియో కాల్‌లో మాట్లాడే అవకాశం ఉండేది. అప్‌డేట్‌తో ఈ సంఖ్యను 32 మందికి పెంచింది. కాగా, వాట్సాప్‌లో వీడియోకాల్‌ ఫీచర్‌ వచ్చిన తొలినాళ్లలో కేవలం ఇద్దరు మాత్రమే పాల్గొనే అవకాశం ఉండేది. తర్వాత ఆ సంఖ్యను వరుసుగా నాలుగు, ఎనిమిదికి పెంచగా పెంచారు. ఇప్పుడు ఆ సంఖ్య 32కు చేరింది.

వాట్సాప్‌లో పోల్‌
సాధారణంగా ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు.. ఎక్కువ మంది గ్రూప్‌ సభ్యుల అభిప్రాయం తెలుసుకుంటారు. ఇలాంటి సమయాల్లో వాట్సాప్​లో మెసేజ్​ పెడితే ఎవరూ సరైన రెస్పాన్స్​ ఇవ్వరు. ఆ సమస్యను తీర్చేలా వాట్సాప్ ఇన్‌-చాట్ పోల్స్‌ అనే ఫీచర్‌ను తీసుకొచ్చింది సంస్థ. ఇందులో మొత్తంగా 12 ఆప్షన్లు ఉంటాయి. గ్రూప్‌ అడ్మిన్‌ పోల్‌ క్రియేట్ చేసి సభ్యులతో షేర్‌ చేస్తారు. అది సభ్యులకు షేర్​ చేస్తే.. వారు తమకు నచ్చిన ఆప్షన్‌ను ఎంపిక చేసి పోల్‌లో పాల్గొంటారు. ఈ ఫీచర్‌ కోసం అడ్మిన్లు ఫైల్‌ అటాచ్‌ అనే ఐకాన్‌పై క్లిక్ చేస్తే.. పోల్ ఆప్షన్‌ కనిపిస్తుంది. దాన్ని ఓపెన్ చేసి మనకు నచ్చిన పోల్‌ క్రియేట్ చేసుకోవచ్చు.
వీటితో పాటు.. గ్రూప్​ల్లో ఇతర సభ్యులు చేసిన మెసేజ్​లను గ్రూప్​ అడ్మిన్ డిలీట్​ చేసేలా పర్మిషన్స్​లో మార్పులు చేసింది. గ్రూప్​ నుంచి ఎవరైనా బయటకు వెళితే(ఎగ్జిట్​) గ్రూప్​ అడ్మిన్​కు సోటిఫికేషన్​ వెళ్లేలా ఫీచర్​ తీసుకొచ్చింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.